దక్షిణ ఆఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఆదివారం దక్షిణార్ధగోళంలో అతి పెద్ద హిందూ ఆలయం, సాంస్కృతిక సముదాయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వందలాది మంది హిందూ భక్తులు పాల్గొన్నారు. అనేక మంది భక్తులను ఆకర్షించిన ఈ ఆలయం దక్షిణాఫ్రికాలో హిందూ సమాజానికి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. దక్షిణాఫ్రికా జనాభాలో హిందువులు రెండు శాతమే అయినా దేశంలోని భారతీయ జనాభాలో ఈ మతానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది.
ఈ సందర్భంగా భారతదేశం నుండి వెళ్లిన 82 ఏళ్ల ఆధ్యాత్మిక నాయకుడు, బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బాప్స్)కు చెందిన మహంత్ స్వామి మహారాజ్ నేతృత్వంలో ఆలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు. భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
📸 Deputy President Paul Mashatile addresses the Official Opening of the archetypal signifier of the Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) Hindu Mandir (Temple) and Cultural Complex, successful Northriding, Johannesburg, Gauteng Province.#GovZAUpdates pic.twitter.com/UXJaUDXpaW
— South African Government (@GovernmentZA) January 30, 2025
ఈ ఆలయాన్ని BAPS “దక్షిణ అర్ధగోళంలో అతిపెద్ద హిందూ సాంస్కృతిక సముదాయం”గా అభివర్ణించింది. ఇది సాంస్కృతిక, మతపరమైన కేంద్రంగా ఉపయోగపడుతుంది. ప్రారంభానికి సన్నాహకంగా, శనివారం జోహన్నెస్‌బర్గ్‌లో ఒక గ్రాండ్ నగర్ యాత్ర ఊరేగింపు జరిగింది. ఇందులో భక్తి పాటలు, సంగీతం, కవాతు బ్యాండ్‌లు, నృత్యకారులతో లయబద్ధంగా డ్యాన్సులు నిర్వహించారు. అందరూ ఆలయ ప్రారంభోత్సవానికి సహకరించారు.
మరిన్ని ప్రపంచ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..