హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2025 ఫలితాలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 5 విడుదల కావాల్సి ఉంది. అయితే నేడు విడుదల కావల్సిన టెట్ ఫలితాలు వాయిదా వేసినట్లు విద్యాశాఖ వెల్లడించింది. అయితే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫలితాల వాయిదా పడ్డాయి. టెట్ పూర్తిగా గ్రాడ్యుయేట్, టీచర్లకు సంబంధించినది కావడంతో ఇబ్బందులు రాకుండా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఏడు ఉమ్మడి జిల్లాల్లో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ఈ మేరకు టెట్ ఫలితాలు వెల్లడి వాయిదా వేసినట్లు విద్యాశాఖ వెల్లడించింది. కాగా తెలంగాణ టెట్ పరీక్షలు జనవరి 2 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. టెట్ ఫలితాల విడుదల తదుపరి తేదీపై ఇప్పటి వరకూ ఏలాంటి స్పష్టత లేనందున.. ఎప్పుడు విడుదలవుతాయో తెలియక అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఏప్రిల్ 5న సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష.. వెల్లడించిన ఎన్‌టీఏ
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నిర్వహించనున్న ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AISSEE)2025 ప్రవేశ పరీక్ష తేదీని ఎన్టీయే విడుదల చేసింది. ఏప్రిల్ 5వ తేదీన ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. ఈ పరీక్ష ద్వారా ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలను కల్పించనున్నారు. ఈ పరీక్ష ఓఎంఆర్ బేస్డ్ విధానంలో ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి
మార్చి 17 నుంచి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం పది పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి 28 వరకు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. రెగ్యులర్ విద్యార్థులతో పాటే సార్వత్రిక విద్యా పీఠం విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. వీటిని పకడ్బందీగా నిర్వహించేందుకు ఈ మేరకు విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకేచోట రెగ్యులర్, సార్వత్రిక విద్యా పీఠం విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు కేటాయించినా గదులు విడివిడిగా ఏర్పాటు చేస్తారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.