హైదరాబాద్, ఫిబ్రవరి 4: తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలకు మార్గం సుగమమైంది. ఈ ఫలితాల విడుదలకు అడ్డుగా ఉన్న రెండు కేసులను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. దీంతో వచ్చే 10, 12 రోజుల్లోనే గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను విడుదలకానున్నాయి. ఈ మేరకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుంది. జీవో 29ను సవాలు చేయడంతోపాటు వికలాంగుల రిజర్వేషన్ అంశాలపై పలువురు గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దానిపై టీజీపీఎస్సీ కేవియట్ పిటిషన్ దాఖలు చేయగా.. ఇటీవల అత్యున్న ధర్మాసనం విచారణ జరిపి అభ్యర్థుల పిటిషన్లను కొట్టివేసింది. దీంతో గ్రూప్ 1 ఫలితాల విడుదలకు అన్ని అడ్డంకులు తొలగినట్లైంది.
మార్చి 6 తెలంగాన ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఐసెట్ 2025 నోటిఫికేషన్ మార్చి 6న విడుదల కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. నోటిఫికేషన్ విడుదల తర్వాత మార్చి 10 నుంచి దరఖాస్తులు స్వీకరన చేపడతారు. టీజీ ఐసెట్ సెట్ కమిటీ సమావేశాన్ని సోమవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించగా.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఐసెట్‌కు మే 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఐసెట్ పరీక్షలు జూన్ 8, 9 తేదీల్లో ఆన్‌లైన్‌లో జరగనున్నాయి.
మార్చి 17 నుంచి పీజీఈసెట్ దరఖాస్తులు ప్రారంభం
2025-26 విద్యా సంవత్సరానికి ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ పీజీఈసెట్ నోటిఫికేషన్ మార్చి 12న విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. మార్చి 17నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం అవుతాయి. సోమవారం కూకట్‌పల్లిలోని జేఎన్టీయూలో నిర్వహించిన సెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ అరుణకుమారి, కో కన్వీనర్ ప్రొఫెసర్ బీ రవీంద్రారెడ్డి పీజీఈసెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.