దీంతో రోడ్డు విస్తరణ కోసం పచ్చని పంట పొలాలను తీసి వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే రోడ్డు వేస్తేనే ఊరు అభివృద్ధి చెందుతుంది అనేది వాస్తవం. అయితే రోడ్డు విస్తరణకు అక్కడి ప్రజలు చాలానే పోగొట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే రోడ్డు గురించి తెలిస్తే వావ్ అనకుండా ఉండలేరు. ఓ ప్రాంతంలో పొలాలను అలాగే ఉంచి మరీ రోడ్డు వేశారు అక్కడి అధికారులు. పంట పొలాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు వేయడం గురించి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ రోడ్డు ఎక్కడ ఉంది. రోడ్డు నిర్మాణానికి అక్కడి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చూద్దామా.. చైనా.. ఈ దేశం గురించి ఎంత చెప్పినా తక్కువే. కారు చౌకలో వస్తువులు, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్‌కు పేరు పొందిన చైనాలో ఎన్నో కొత్త నిర్మాణాలు జరుగుతుంటాయి. అలాంటి వాటిలో పంట పొలాలపై రోడ్డు కూడా ఒకటి. పంటలకు ఎలాంటి నష్టం కలగకుండా.. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అక్కడి అధికారులు. పంట పొలాల పైనుంచి ఆరు లైన్ల రోడ్డును నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ రోడ్డు కోసం పొలాలకు నష్టం కలగకుండా అక్కడి ప్రభుత్వం సరికొత్త ఐడియాతో పంట పొలాల పైనుంచే హైవే నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. హుబే ఫ్రావిన్స్‌లో ఈ సరికొత్త హైవే నిర్మాణం రూపుదిద్దుకుంటోంది. దాదాపు 126 కిలోమీటర్ల పొడవున్న హైవే నిర్మాణం సాగుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నడవలేను.. పడుకోలేను ! సునీతా విలియమ్స్ పోరాటం
పెళ్లికి ఊరేగింపుగా వచ్చిన వరుడికి ఊహించని షాక్..ఏం జరిగిందంటే ??
భూమ్మీద నరకం.. ఆ జైలు.. అక్రమ వలసదారులను అక్కడికే