ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో వెంకటేశ్ జోడిగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. వెంకీమామ కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచిపోయింది. తాజాగా ఈ సినిమా భారీ మైల్ స్టోన్ దాటింది. దీంతో ఇప్పటివరకు సంక్రాంతి బరిలో నిలిచిన హీరోలలో వెంకటేశ్ రికార్డ్ సృష్టించారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ.300 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.303 కోట్ల గ్రాస్ రాబట్టిందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. రీజనల్ చిత్రాల్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అని తెలిపింది. 20 రోజుల్లోనే దాదాపు రూ.303 కోట్లు రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది ఈ మూవీ. కేవలం రూ.50 కోట్ల లోపు బడ్జెట్ తోనే రూపొందించిన ఈ సినిమా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారీ వసూళ్లు కొల్లగొట్టింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అటు మేకర్స్.. ఇటు డిస్ట్రిబ్యూటర్లకు సైతం లాభాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే డిస్ట్రిబ్యూటర్స్ ప్రెస్ మీట్ సైతం నిర్వహించారు. ఈ చిత్రంతో భారీ లాభాలను గడించామని వెల్లడించారు. ఈ వేడుకలో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ సైతం పాల్గొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ లుక్ రివీల్.. పోస్టర్ అదిరిందిగా..!
లావణ్య -రాజ్ తరుణ్ వ్యవహారంలో.. మస్తాన్ సాయి అరెస్ట్
అమ్మకానికి పులి మూత్రం.. ఒక్క సీసా ఎంతో తెలుసా ??
Palmyra Sprout: తేగలతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం