ప్రస్తుతం సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. పైన ఫోటోను చూశారా.. ? తెల్ల గౌను ధరించి ప్రిన్సెస్ లా మెరిసిపోతున్న ఆ అమ్మాయిని గుర్తుపట్టారా.. ? సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అందం, అభినయంతో కట్టిపడేసింది. కానీ ఇప్పటికీ సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. 2005లో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు దాదాపు 40కు పైగా సినిమాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలోనూ నటించింది. కానీ ఇప్పటివరకు సరైన స్టార్ స్టేటస్ మాత్రం రాలేదు. ఇక కొన్నాళ్లుగా తెలుగులోనూ అంతగా సినిమాలు చేయడం లేదు. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ? తను మరెవరో కాదు.. హీరోయిన్ రెజీనా కసాండ్రా. ఒకప్పుడు గ్లామర్ రోల్స్ కు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. కానీ ఇప్పుడు విభిన్నమైన కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది.
అంతేకాకుండా హారర్ జోనర్ చేసేందుకు సైతం రెడీ అయ్యింది. పలు సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించి మంచి మార్కులు కొట్టేసింది. టాలీవుడ్ హీరో సుధీర్ బాబు సరసన శివ మనసులో శృతి అనే సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత సందీప్ కిషన్ జోడిగా రోటిన్ లవ్ స్టోరీ యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో కొత్త జంట, రారా కృష్ణయ్యా, పిల్ల నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, పవర్, సౌఖ్యం, జో అచుతానంద వంటి సినిమాల్లో నటించింది.
అయితే తెలుగుతోపాటు తమిళంలోనూ పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడుకు ఇప్పటివరకు సరైన బ్రేక్ రాలేదు. ఇక సినిమాల గురించి పక్కన పెడితే.. రెజీనా లవ్ స్టోరీస్ గురించి ఎక్కువగా తెరపైకి వచ్చాయి. స్టార్ హీరోలతో ప్రేమలో ఉందనే రూమర్స్ వినిపించాయి.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన