సినీరంగంలో చాలా మంది హీరోయిన్స్ ఇలా వచ్చి అలా మాయమవుతుంటారు. కథానాయికగా చేసింది కొన్ని సినిమాలే అయినా తమ మార్క్ ను వదిలి వెళ్తుంటారు కొంతమంది. ఒకటి రెండు సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. అలాంటి హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఇంతకీ పైన ఫోటోను చూశారా..? అందులో జూనియర్ పక్కన నిలబడి ఉన్న ఆ హీరోయిన్ ఎవరో గుర్తుప్టటారా..? ఇంతకీ ఆ సినిమా ఏంటో గుర్తుకు వచ్చిందా.. ? ఆ హీరోయిన్ పేరు మంజరి ఫెడ్నస్. ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమాలో కనిపించింది. అంతకు ముందు అల్లరి నరేష్ నటించిన సిద్దూ ఫ్రేం శ్రీకాకుళం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఆతర్వాత మరోసారి అల్లరి నరేష్ తో కలిసి శుభ ప్రదం అనే సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ రెండు చిత్రాల్లో అందం, అభినయంతో కట్టిపడేసింది. కానీ మంజరికి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. శుభప్రదం సినిమాలో నటిగా ప్రశంసలు అందుకున్న మంజరికి ఆ తర్వాత తెలుగులో ఊహించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ భార్యగా కనిపించింది. ఈ సినిమాలో మరింత అందంగా కనిపించింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో మంజరికి గుర్తింపు రాలేదు.
దీంతో ఈ అమ్మడు హిందీలోకి షిప్ట్ అయ్యింది. అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండిపోయింది. మరాఠి, హిందీలో ఎక్కువగా సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. అటు వెబ్ సిరీస్ సైతం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న ఈ బ్యూటీ…వరుసగా ఫోటోస్ షేర్ చేస్తుంది. ఒకప్పుడు పద్దతిగా, బొద్దుగా కనిపించిన మంజరి.. ఇప్పుడు గ్లామర్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..