హైదరాబాద్‌లో చదువుతున్నప్పుడు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె 2000లో మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 2001లో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. తనే దియా మీర్జా. సినీరంగంలోకి అడుగుపెట్టడానికి ముందు ఆమె హైదరాబాద్‌లో మార్కెటింగ్ ప్రొఫెషనల్‌గా పనిచేసింది. ఆ తర్వాత మోడలింగ్‌లోకి ప్రవేశించి.. లిప్టన్, వాల్స్ ఐస్ క్రీమ్, ఇమామి వంటి ప్రముఖ వాణిజ్య ప్రకటనలలో కనిపించింది. వరుస యాడ్స్ కారణంగా ఆమె గ్రాడ్యుయేషన్ మధ్యలోనే వదిలేసింది. 2000లో మిస్ ఆసియా పసిఫిక్ టైటిల్ గెలుచుకుంది. అదే సంవత్సరం లారా దత్తా , ప్రియాంక చోప్రా వరుసగా మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ గెలుచుకున్నారు. ఆమె మిస్ బ్యూటిఫుల్ స్మైల్ బిరుదులు సొంతం చేసుకుంది.
2005లో అందానికి గానూ గ్రేట్ ఉమెన్ అచీవర్ అవార్డును అందుకుంది. ఆమె 2001లో సైఫ్ అలీ ఖాన్, ఆర్ మాధవన్‌లతో కలిసి రెహ్నా హై టెర్రే దిల్ మేతో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఈ సినిమా తర్వాత హిందీలో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యింది. దస్, లగే రహో మున్నా భాయ్, సంజు, తప్పడ్, భీద్ వంటి అనేక చిత్రాలలో కనిపించింది. ఆమె బోర్న్ ఫ్రీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను సహ-స్థాపన చేసి, తర్వాత 2019లో తన సొంత ప్రొడక్షన్ హౌస్, వన్ ఇండియా స్టోరీస్‌ని ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె కాఫిర్, IC 814: ది కాందహార్ హైజాక్ వంటి స్ట్రీమింగ్ సిరీస్‌లలో నటించింది. ఆమె చివరిగా ధక్ ధక్‌లో రత్న పాఠక్, ఫాతిమా సనా షేక్, సంజన సంఘీలతో కలిసి కనిపించింది.
నటిగానే కాకుండా పర్వావరణ, సామాజిక కారణాల కోసం రాయబారిగా వ్యవహరించింది. అలాగే పర్యావరణ, వన్యప్రాణులు, మానవతా సమస్యల కార్యకర్తగా పనిచేసింది. క్యాన్సర్ పేషెంట్స్ ఎయిడ్ అసోసియేషన్, స్పాస్టిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా వంటి సంస్థలకు మద్దతు ఇస్తుంది. ఆమె HIV, ఆడపిల్ల భ్రూణహత్యలు, భారతదేశంలో గ్రామీణాభివృద్ధిపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు, ఫౌండేషన్‌లతో కలిసి పనిచేసింది. భారతదేశానికి UN పర్యావరణ గుడ్‌విల్ అంబాసిడర్‌గా పనిచేసింది. 2021 లో, ఆమె వ్యాపారవేత్త వైభవ్ రేఖీని వివాహం చేసుకుంది. అంతకు ముందు సాహిల్ వ్యక్తితో విడాకులు తీసుకుంది.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన