ఇంగ్లండ్ తో జరుగుతోన్న ఐదో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇంగ్లండ్ బౌలర్లను చీల్చి చెండాడుతూ కేవలం 37 బంతుల్లోనే మెరుపు సెంచరీ సాధించాడు. దీంతో భారత జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది.
Abhishek Sharma
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. సంజూతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన అభిషేక్ తొలి బంతి నుంచే అద్భుతంగా ఆడి కేవలం 37 బంతుల్లోనే మెరుపు సెంచరీని నమోదు చేశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన భారత క్రికెటర్‌గా రికార్డుల కెక్కాడు. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న రోహిత్ శర్మ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
సెంచరీ సాధించిన సంతోషంలో అభిషేక్ శర్మ..
Hundred reasons to celebrate! 📸📸
ఇవి కూడా చదవండి
Live ▶️ https://t.co/B13UlBNdFP#TeamIndia | #INDvENG | @idfcfirstbank pic.twitter.com/qQUC6EAOlh
— BCCI (@BCCI) February 2, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..