ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో ఎంతో మంది యువ ప్రతిభావంతులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు ఆస్ట్రియాలో అత్యుత్తమ శిక్షణ అందించేందుకు ఒక సువర్ణావకాశాన్ని అందించడమే ఈ పాన్-ఇండియా కార్యక్రమం లక్ష్యం.
కాగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ ట్రయల్స్‌ను 12-14, 15-17 వయస్సు వర్గాలుగా విభజించారు, లక్నో, ఢిల్లీ, జమ్మూ, కాశ్మీర్, మణిపూర్ తదితర నగరాల నుంచి బాలురు, బాలికలు ఈ గేమ్స్ లో పాల్గొంటున్నారు. ట్రయల్స్ ప్రారంభానికి ముందు, ఢిల్లీ సాకర్ అసోసియేషన్ అధ్యక్షుడు, సుదేవా FC యజమాని అనుజ్ గుప్తా క్రీడాకారులకు స్వాగతించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో జరిగిన ట్రయల్స్ లో సుమారు 500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. వారిలో 100 మందికి పైగా బాలికలు ఉన్నారు. 12-14 కేటగిరీ ట్రయల్స్ ఉదయం చాలా ఉత్సాహంతో ప్రారంభమయ్యాయి. ఆటగాళ్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి జట్టులో ఫార్వర్డ్‌లు, మిడ్‌ఫీల్డర్లు, డిఫెండర్లు, గోల్ కీపర్లు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
“ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్సెస్” చొరవకు సాంకేతిక భాగస్వామిగా పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన ఫుట్‌బాల్ క్లబ్ సుదేవా FC యజమాని అనుజ్ గుప్తా, ఎంపికైన పిల్లలు ఆస్ట్రియాలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్లాట్‌ఫామ్‌లను పొందే యువ ఆటగాళ్ళు భవిష్యత్తులో రోల్ మోడల్‌లుగా మారగలరని ఆయన ఆకాంక్షించారు. ‘యువ ఫుట్‌బాల్ క్రీడాకారులు మరింత మెరుగు పడడానికి, చిన్నప్పటి నుండే వారికి అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవి. కేవలం ఒక ట్రయల్ కంటే, పిల్లలు తమ స్థాయిని అర్థం చేసుకోవడానికి, తోటివారితో పోటీ పడటానికి, పెద్ద కలలు కనడానికి సహాయపడే అనుభవం ఇది. ఆశయం, దృఢ సంకల్పంతో చాలా మంది యువకులను ఒకే చోట చూడడం ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు.
ట్రయల్స్ లో క్రీడాకారులు..
ఈవెంట్ భాగస్వాములు
-
పోషకాహార భాగస్వామి: అమూల్
-
గ్రీన్ ఎనర్జీ భాగస్వామి: గెయిల్
-
స్కూల్ పార్టనర్: ఆర్కిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్
-
సాంకేతిక భాగస్వామి: సుదేవా ఢిల్లీ FC – శ్రీ అనుజ్ గుప్తా సుదేవా FC సహ యజమాని అధ్యక్షుడు & ఢిల్లీ సాకర్ అసోసియేషన్ అధ్యక్షుడు
” ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్సెస్” యూరప్‌లోని అత్యుత్తమ వ్యాపార సంస్థలైన DFB పోకల్, బుండెస్లిగా, ఇండియా ఫుట్‌బాల్ సెంటర్, IFI, BVB, RIESPO వంటి వాటితో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..