వాస్తు శాస్త్రంలో చెట్లు, మొక్కలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తు నియమాల ప్రకారం ఇంట్లో చెట్లు, మొక్కలు నాటడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. అయితే చెట్లు, మొక్కలు నాటడానికి సంబంధించి వాస్తు శాస్త్రంలో ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ఈ నియమాలను పాటించి ఇంటి ఆవరణలో చెట్లను నాటడం వల్ల సంపద, ఐశ్వర్యం పెరుగుతుందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రంలో కొన్ని మొక్కలను నాటడం శుభప్రదంగా పరిగణిస్తారు. అయితే కొన్ని మొక్కలు అశుభం.
ఇంట్లో నాటకూడని పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి…
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నాటకూడని పండ్ల మొక్కలలో నిమ్మచెట్టు ఒకటి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ముళ్ల మొక్కను నాటడం అశుభం. నిమ్మచెట్టు మంచిదే అయినా దానికి ముళ్ళు ఉంటాయి. ఈ కారణంగానే ఇంట్లో నిమ్మ చెట్టును నాటడం నిషేధించారు. ఇంట్లో నిమ్మ మొక్కను నాటడం వల్ల వాస్తు దోషాలు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఈ పండ్ల మొక్కను ఇంట్లో నాటడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య టెన్షన్ ఏర్పడుతుంది. అంతేకాదు.. ఈ మొక్క కారణంగా కుటుంబ సంబంధాల మధ్య కూడా విభేదాలు కలిగిస్తుంది.
ఇవి కూడా చదవండి
వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ మొక్కను ఇంటి లోపల నాటడానికి బదులుగా, ఇంటి వెలుపల నాటవచ్చు. ఇంట్లో నిమ్మ మొక్క ఉంటే వెంటనే ఇంట్లో నుంచి తీసేయండి. బదులుగా బొప్పాయి, దానిమ్మ, అరటి, కొబ్బరి, టమాటా, జామ మొదలైన పండ్ల చెట్లను పెంచుకోవచ్చు. ఈ పండ్ల మొక్కలు మీ ఇంటి ఆవరణలో ఉండటం శుభప్రదంగా భావిస్తారు. ఈ పండ్ల మొక్కలు ఎలాంటి వాస్తు దోషాన్ని కలిగించవు.
పండ్ల చెట్లను ఏ దిశలో నాటాలి?
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో పండ్ల చెట్లను నాటేటప్పుడు, వాటి దిశలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇంట్లో పండ్ల చెట్లను నాటినట్లయితే, అవి తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉండాలి. అలాగే, ఇంట్లో నాటిన పండ్ల మొక్కలు ఎండిపోకూడదని గుర్తుంచుకోండి. ఇంటి ఆవరణలో నాటిన పండ్ల మొక్క ఎండిపోతే వెంటనే తొలగించాలి.
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..