ప్రేమికుల దినోత్సవం (వాలెంటైన్స్ డే) త్వరలో రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో యువత దీని కోసం ఎదురు చూస్తున్నారు. ఆత్మీయులకు తమ ప్రేమను తెలిపే సమయం కోసం వేచి ఉన్నారు. చాలామంది ఈ రోజున తమ ప్రేమను వ్యక్త పరుస్తుంటారు. ఇప్పటి వరకూ స్నేహితులుగా ఉన్నవారు ఈ రోజు నుంచి ప్రేమబంధంలోకి అడుగు పెడతారు.
Valentines Day
ఇప్పటికే పెళ్లయిన వారు సైతం ప్రేమికుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి ప్లాన్ చేస్తారు. తమ జీవిత భాగస్వామితో సరదాగా గడపాలని కోరుకుంటారు. అయితే వాలెంటెన్స్ డే ను ఉత్సాహంగా జరుపుకోవాలంటే ముందుగా ప్రణాళిక వేసుకోవడం చాలా అవసరం. ఈ క్రింది తెలిపిన పద్దతుల్లో మీకు నచ్చిన దాన్ని పాటించవచ్చు. ప్రేమికుల దినోత్సవాన్ని ఇంటిలోనే ఘనంగా జరుపుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. బయటకు వెళ్లకుండా సమయాన్ని ఇంటిలోనే గడపాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది. ముందుగా కొవ్వొత్తులు, పువ్వులు, ఇతర అలంకరణ వస్తువులతో ఇంటిని అలంకరించుకోవాలి. మీ జీవిత భాగస్వామికి ఇష్టమైన వంటలు, పాటలు, బహుమతులు అందజేసి ప్రత్యేకంగా సెలబ్రెట్ చేసుకోవచ్చు.
- వాలెంటెన్స్ డే సెలబ్రేషన్స్ కోసం కొందరు బయట ప్రాంతాలకు వెళ్లటానికి ఆసక్తి చూపుతారు. అలాంటి వారందరూ కొండలతో ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశాలకు, నదులు, సముద్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. మీ భాగస్వామికి హైకింగ్, సూర్యాస్తమయ ప్రదేశంలో సమయం గడపడం ఇష్టమైతే హిల్ స్టేషన్ ను సందర్శించవచ్చు. బీచ్ లు, నదీ తీర ప్రాంతాలు కూడా ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి.
- మన జీవితంలో ఫొటోలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. కాలాన్ని వెనక్కి తీసుకువెళ్లగలిగే శక్తి వాటికి మాత్రమే ఉంది. వాలెంటైన్స్ డే ఆనందం కలకాలం గుర్తుండేలా ప్రసిద్ధ టూరిస్ట్ స్పాట్ కు మీ భాగస్వామిని తీసుకువెళ్లి ఫొటో షూట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్రొఫెషనల్ ఫ్రొటోగ్రాఫర్లను ఏర్పాటు చేసుకోవచ్చు.
- నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో క్షణం తీరక ఉండడం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకూ పనులతో బిజీగా గడిపేస్తుంటారు. ఈ నేపథ్యంలో వాలెంటైన్స్ రోజు షాపింగ్, సరదా కార్యకలాపాలతో గడపాలని ప్లాన్ చేసుకోవచ్చు. మీ జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేయడం, ఆమెకు నచ్చిన వస్తువులు కొనడం, మంచి రెస్టారెంట్ లో భోజనం, ఆమెకు ఇష్టమైన సినిమాకు తీసుకువెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు. మీ నగరంలోని ఫేమస్ రెస్టారెంట్ లో డిన్నర్ , వీధి ఫుడ్ ను రుచి చూడడం.. ఇలా ఆ రోజు కొత్తగా డపటానికి ప్లాన్ చేసుకోవచ్చు.
- వాలెంటైన్స్ డే కోసం బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం అన్నింటా ముఖ్యమైన విషయం. ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా ముందుగానే చూసుకోవాలి. మీ భాగస్వామికి మీ ప్రేమను వ్యక్తపర్చడానికి వాలెంటైన్స్ డే అత్యంత అనుకూలమైన సందర్భం. దీనికోసం పర్సనల్ రుణాలు తీసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి