భారతదేశంలో చదువుకోని పట్టభద్రులెందరో మట్టిలో మాణిక్యాల్లా ఉండిపోయారు. అయితే సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ప్రతిభావంతులెందరో వెలుగులోకి వస్తున్నారు. తాము చేసే పని సక్రమంగా, సులువైనమార్గాల్లో పూర్తి చేసేందుకు వారు చేసే ఆలోచనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ ఎలక్ట్రీషియన్ చేసిన తెలివైన పనికి నెటిజన్లు హ్యాట్సాఫ్ అంటున్నారు. ఇంతకీ అతను ఏం చేశాడో తెలుసా..
కొందరు ఎలక్ట్రీషియన్లు కొత్తగా నిర్మించిన ఓ ఇంట్లో వైరింగ్ పని చేస్తుంటారు. వారిలో ఓ వ్యక్తి ఇంట్లో స్టాండ్ వేసుకుని సీలింగ్‌లో వైరింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. క్రమంలో ఓ ఖాళీ పైపును కిందకు లాగాడు. అందులో అతను అక్కడ చేయాల్సిన వైరింగ్ పనికి సంబంధించిన వైర్లు లాగాలి. అదే సమయంలో ఆ పైపు లోకి వైర్లు పంపేందుకు మేడ పైన మరో ఎలక్ట్రీషియన్ ఎదురు చూస్తుంటాడు. అయితే చాలా పైపులు ఉండడంతో ఎందులో నుంచి వైరు పంపాలో పైన ఉన్న అతనికి అర్థం కాలేదు. దీంతో ఇంట్లో ఉన్న వ్యక్తి తెలివిగా ఆలోచించాడు. వెంటనే తన జేబులోని సిగరెట్ ప్యాకెట్ తీసి ఓ సిగరెట్ వెలిగించి, గట్టిగా రెండుమూడు దమ్ములు లాగాడు. అనంతరం పొగలు బయటకు వదిలేయకుండా వైర్లు పంపాల్సిన పైపులోకి వదిలాడు.
ఇవి కూడా చదవండి
దాంతో ఆ పొగ మొత్తం ఆ పైపులోనుంచి ఇంటిపై ఉన్న పైపు గుండా బయటికి వచ్చింది. దాన్ని చూసి ఆ వ్యక్తి ఆ పైపు గుండా వైర్లను పంపించేసాడు. దీంతో వారి పని సులభమైపోయింది. ఇలా సిగరెట్ పొగను వైరింగ్ చేసేందుకు వాడుకున్న ఇతడి తెలివితేటలుకి అంతా ముక్కున వేలేసుకున్నారు. సిగరెట్లు ఇలా కూడా ఉపయోగపడతాయా అని ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటికే 64 వేలమందికి పైగా వీక్షించారు. వందలమంది లైక్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Bro utilized 100% of his encephalon 😂 🔥 pic.twitter.com/U5uGLY72nH
— Guhan (@TheDogeVampire) February 5, 2025
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి