విశాఖ KGHలో జరిగిన ఈ ఘటనతో నగరమంతా ఉల్కిపడింది. NICUకు వెళ్లే ఆక్సిజన్ సరఫరా నిలిపిసి పసిపిల్లల ప్రాణాలతో రౌడీషీటర్లు చెలగాటమాడారు. ఏకంగా ఆక్సిజన్ పైపులు కట్ చేసేందుకు యత్నించారు. తనను ఉద్యోగంలో తీసేసారనే కోపంతో ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. ఐతే సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. సెక్యూరిటీ అతన్ని అడ్డుకోగా.. కత్తితో బెదిరించి దాడికి కూడా యత్నించారు. ఈ ఘటనపై సీపీకి ఫిర్యాదు చేశారు ఆస్పత్రి సూపరింటెండెంట్. రౌడీషీటర్ రేపుల రాజు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఆ NICU వార్డులో మొత్తం 150 మంది పసిపిల్లలు ఉన్నట్లు చెప్పారు ఆస్పత్రి సూపరింటెండెంట్ శివానంద్. సిబ్బంది అప్రమత్తతోనే పెను ప్రమాదం తప్పిందన్నారు. గతంలోనూ రేపుల రాజు ఇలాగే చేయగా.. పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.. అయితే పోలీస్ కౌన్సిలింగ్ తర్వాత కూడా అతడిలో మార్పు రాలేదంటున్నారు..
రేపుల రాజుపై రౌడీషీట్ కూడా ఉందంటున్నారు సీఐ జీడీ.బాబు. గంజాయి మత్తుకు బానిస కావడంతో ఆసుపత్రి నుంచి రాజును సస్పెండ్ చేశారు. దీంతో వారిపై కక్ష పెంచుకున్న రాజు ఈ విధంగా చేశాడని చెబుతున్నారు. ఈ ఘటనలో రాజు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..