అమ్మ బాబోయ్.. మళ్లీ పెద్దపులి సంచరిస్తోంది.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ.. దాని ఆనవాళ్లు కనబడుతున్నాయి. దీంతో ఆ గ్రామాలు గజగజ వణికిపోతున్నాయి.. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండాపూర్ అటవీ ప్రాంతంలో ఓ రైతు పొలం వద్ద ఉన్న ఆవును పెద్ద పులి చంపి తిన్న సంఘటన చోటు చేసుకుంది. కొండాపూర్ గ్రామానికి చెందిన గుండు బాబు అనే రైతు అటవీ ప్రాంత శివారులోని తన వ్యవసాయ పొలం వద్ద ఆవును కట్టివేసి ఉంచారు. ఉదయం వెళ్లి చూడగా పెద్దపులి తిన్నట్టుగా రైతు భావించి ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
అయితే.. సంఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం పెద్దపులిగా భావించిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. మండలంలోని అటవీ ప్రాంతం ఉన్న కోడీమ్యాల కొండాపూర్, భోళ్ళెం చెరువు, సురేంపెట్, దమ్మయ్యపేట, రామకిష్టాపూర్, భీమరం మండలం గోవిందరంలో పులి సంచరిస్తున్నట్లు పేర్కొంటున్నారు.
వీడియో చూడండి..
దీంతో అటవీ శాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ ప్రాంతానికి ఒంటరిగా వెళ్లకూడదని సూచించారు. కాగా కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ విస్తీర్ణం 40 వేల ఎకరాలు ఉండటంతో పెద్ద పులులు వచ్చే అవకాశముందని తెలిపారు. ఒంటరిగా వెళ్ళకూడదని, ఏమైనా ఆనవాళ్లు ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..