మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ప్రస్తుతం ధన, లాభ స్థానాలు బాగా బలంగా ఉన్నందువల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కూడా పొందుతారు. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపా రాలు కూడా సానుకూలంగా, లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడు తుంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్ర యత్న కార్యసిద్ధికి, వ్యవహార జయానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితం చాలావరకు ప్రశాం తంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు బాగా సంతృప్తికరంగా సాగిపోతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఘన విజయాలు సాధిస్తారు.
1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల వారం రోజుల పాటు జీవితం సుఖ సంతో షాలతో సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు లభించవచ్చు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. రావలసిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను కొద్ది శ్రమతో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ పెడ తారు. బంధువుల నుంచి పెళ్లి సంబంధానికి సంబంధించిన శుభవార్త అందుతుంది. నిరుద్యోగు లకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.
2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): దశమ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం, రాశ్యధిపతి బుధుడు రవితో కలవడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఉద్యోగంలో మీ సమర్థతను నిరూపించుకుంటారు. పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా ముందుకు దూసుకు వెడతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయడం జరుగుతుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా సాగి పోతుంది. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. అయితే, ఎవరికీ హామీలు ఉండవద్దు.
3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): భాగ్య స్థానంలో శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం, లాభ స్థానంలో గురు సంచారం వల్ల వారం రోజుల పాటు జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అష్టమ శని దోషం తొలగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆదాయం వృద్ధి చెందడం, రావలసిన సొమ్ము చేతికి అందడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వ్యాపారాల్లో జోరు పెరుగుతుంది. సొంత పనుల మీద ఎక్కువగా దృష్టి పెడతారు. నిరుద్యోగులకు ఒకటి రెండు అవకాశాలు అంది వస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): దశమ స్థానంలో గురు సంచారం జరుగుతుండడం, దశమాధిపతి శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఉద్యోగ జీవితం చాలావరకు సంతృప్తికరంగా సాగిపోతుంది. ఊహించని పురోగతి కలుగు తుంది. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. నిరుద్యోగులకు మంచి కంపె నీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. వృథా ఖర్చుల్ని తగ్గించు కోవడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో మాట తొందరపాటు లేకుండా చూసుకోవాలి. కొత్త ఆదాయ మార్గాల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వ్యాపారాల్లో నష్టాల నుంచి, ఆర్థిక ఒత్తిళ్ల నుంచి చాలా వరకు బయటపడతారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ చూపిస్తారు. ప్రేమ వ్యవహా రాలు సానుకూలంగా సాగిపోతాయి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.
5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): భాగ్య స్థానంలో గురువు, సప్తమ స్థానంలో ఉచ్ఛ శుక్రుడు, షష్ట స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ పరిస్థితి ఇదివరకటి కంటే మెరుగ్గా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. రావలసిన ధనం చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యో గులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావ రణం ఉంటుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరో గ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు.
6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రాశ్యధిపతి శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం, చతుర్థ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయటపడతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. సాధారణంగా ఏ ప్రయత్నం తల పెట్టినా విజయం సాధిస్తారు. రాదనుకుని వదిలేసుకున్న సొమ్మును రాబట్టుకుంటారు. ఉద్యో గంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించి, అనుకున్న సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు సుఖ సంతోషాలతో సాగిపోతాయి.
7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఈ రాశివారికి గ్రహ బలం పూర్తి స్థాయిలో అనుకూలంగా లేనందువల్ల ప్రతి విషయంలోనూ ఆచి తూచి వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవ సరం ఉంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం శ్రేయస్కరం. ఉద్యోగంలో అధికా రుల కారణంగా పని భారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొద్ది లాభాలతో పురోగతి చెందు తాయి. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, వ్యక్తిగత పనులు నిదానంగా పూర్త వుతాయి. ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సాదాసీదాగా సాగిపోతాయి. జీవిత భాగస్వామితో కలిసి ఒకటి రెండు ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ధన స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం, తృతీయంలో శని, చతుర్థంలో శుక్రుడి ఉచ్ఛ స్థితి వల్ల వారమంతా హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది. కొద్ది వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదా యం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది. కొత్త ప్రయత్నాలకు, కొత్త నిర్ణయాలకు ఇది అనుకూల సమయం. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ఆశించిన విధంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. ధనపరంగా ఎవ రికీ వాగ్దానాలు చేయవద్దు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది.
9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రాశ్యధిపతి శని ధన స్థానంలో ఉండడం, దశమాధిపతి శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల ఉద్యోగంలో ఆర్థిక లాభాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. రాబడికి, లాభాలకు లోటుండదు. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరిగే అవకాశం ఉంది. సొంత పనుల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రేమ వ్యవహారాలు చాలావరకు హ్యాపీగా సాగిపోతాయి. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.
10 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ధన స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడంతో పాటు, గురువుతో పరివర్తన చెందడం వల్ల ఈ రాశివారికి ఏలిన్నాటి శని దోషం చాలావరకు తగ్గిపోయే అవకాశం ఉంది. తక్కువ శ్రమతో అధిక లాభాలు పొందే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా వృద్ధి చెందు తాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణ యాలు అమలు చేస్తారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు.
11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ రాశిలో శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు రాశ్యధిపతి గురువుతో పరివర్తన చెందడం వల్ల ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవ కాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతుంది. వ్యాపారాల్లో దూసుకుపో తారు. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందడంతో పాటు, ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంది. తల్లితండ్రుల నుంచి వారసత్వ ఆస్తి సంక్రమించే సూచనలున్నాయి. ఇష్ట మైన ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంతో కలిసి విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
12 / 12