మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): అనుకోని మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు విజయవంతం కావడంతో పాటు, రావలసిన సొమ్ము కూడా అందుతుంది. ఉద్యోగపరంగా కొన్నిశుభ ఫలితాలను పొందడం జరుగుతుంది. మీ ప్రయత్నాలన్నీ తప్పకుండా సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు దాదాపు రెట్టింపవుతాయి. ఆర్థికంగా కొన్ని పెట్టుబడులకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ ఖర్చుల విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. శ్రమ, తిప్పట ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి.
1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి, అదనపు బాధ్యతల నుంచి బయటపడతారు. పదోన్నతి కలిగే అవకాశం కూడా ఉంది. వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది. కొందరు బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. డబ్బు ఇవ్వడం, డబ్బు తీసుకోవడం వంటి లావాదేవీలు పెట్టు కోవద్దు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆశించిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలను ప్రస్తుతానికి విరమించుకోవడం మంచిది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.
2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ధనపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయ వృద్ధికి కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభాల వర్షం కురిపిస్తాయి. ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమవు తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లల మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ప్రయాణాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్నేహితుల వల్ల వృథా ఖర్చులు ఉంటాయి. విదేశీయానానికి ఆటంకాలు తొలగుతాయి.
3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఒకటి రెండు శుభవార్తలు వినడం కూడా జరుగుతుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి కొద్దిగా ఆస్తి కలిసి వచ్చే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. షేర్లు, ఇతర పెట్టుబడులు కూడా బాగా లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో తేలికగా విజయం సాధిస్తారు. ఆస్తి వివాదం నుంచి తేలికగా బయటపడతారు. తల్లితండ్రుల సహకారంతో కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు తమకు నచ్చిన ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.
4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఆదాయం నిలకడగా సాగిపోతుంది కానీ, అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆదాయ ప్రయ త్నాలు కొద్దిగా మందగిస్తాయి. రావలసిన సొమ్ము ఒక పట్టాన అందకపోవచ్చు. కొద్ది ప్రయ త్నంతో కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి,, ఉద్యోగాలలో డిమాండ్ బాగా పెరుగుతుంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహకరించే అవకాశం ఉంది. ధనపరంగా ఎవరికీ ఎటువంటి వాగ్దానం ఇవ్వకపోవడం మంచిది. కుటుంబపరంగా ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలక డగా ఉంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి శుభవార్త అందుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్త వుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయానికి, గౌరవ మర్యాదలకు లోటుండదు. మీ పని తీరుకు, సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో మీ నిర్ణయాలు లాబాలను పెంచు తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. కొందరు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్ప డతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది.
6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. చిన్న ప్రయత్నంతో, తక్కువ శ్రమతో అత్యధిక లాభాలు కలుగుతాయి. ఆకస్మిక దన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఆర్థిక వ్యవహారాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. మదుపులు, పెట్టుబడులు పెంచడం వల్ల బాగా లబ్ధి పొందుతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధి స్తారు. మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభి స్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు లభి స్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ పెట్టడం మంచిది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్త వింటారు.
7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఈ రాశివారికి ఉద్యోగంలో పని భారం బాగా పెరిగే అవకాశం ఉంది. అధికారులు ఎంతో నమ్మకంతో అదనపు బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. సహోద్యోగులకు ఆశించిన సహాయ సహ కారాలు అందిస్తారు. వ్యాపారాలు ఆశాజనకంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. కొత్త ఉద్యోగానికి సంబంధించి చిన్న పాటి ప్రయత్నం కూడా విజయవంతం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన తోడ్పాటు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. లాభదాయకమైన పరిచయాలు ఏర్ప డతాయి. కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవడంలో తొందరపాటు వైఖరి మంచిది కాదు.
8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ అంచనాలకు మించిన ఫలితాలని స్తాయి. దాదాపు అన్ని విషయాల్లోనూ అనుకూల పరిస్థితులుంటాయి. ఇంటా బయటా బరువు బాధ్యతలు కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో ఊహించని పురోగతి ఉంటుంది. ఏ ప్రయత్నం చేపట్టినా సకాలంలో సంతృప్తికరంగా నెరవేరుతుంది. బంధువుల వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పిల్లలతో కొద్దిగా సమస్యలు ఉన్నప్పటికీ, కుటుంబ జీవితం మాత్రం ప్రశాంతంగా సాగిపోతుంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం.
9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆదాయానికి సంబంధించి కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయి. శ్రమ బాగా పెరిగినప్పటికీ అంచనాలకు మించిన ఫలితాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అధికారులకు మీ సమర్థత మీద బాగా నమ్మకం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభ వార్త అందుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
10 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగంలో పని భారం ఎక్కువగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా శ్రమాధిక్యత ఉంటుంది. అయితే, ఆదాయాలు, లాభాలకు లోటుండదు. వ్యక్తిగతం గానూ, కుటుంబపరంగానూ కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. ఉచిత సహాయాలు, అనవసర ఖర్చులు బాగా తగ్గించుకోవడం మంచిది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. స్నేహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది.
11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆదాయం నిలకడగా సాగిపోతుంది. కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. గృహ ప్రయ త్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్లు వేస్తారు. విహార యాత్రకు వెళ్లే అవ కాశం కూడా ఉంది. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. దాదాపు ప్రతి ప్రయ త్నమూ సఫలం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ ఆలోచనలకు విలువ పెరుగుతుంది. వ్యాపా రాల్లో అంచనాలకు మించిన లాభాలు కనిపిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందే అవ కాశం ఉంది. బంధువుల ద్వారా పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే అవకాశం కూడా ఉంది. ఆర్థిక, రుణ సమస్యల నుంచి ఊరట లభి స్తుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
12 / 12