కుంభమేళాకు తీసుకువెళతాం.. టికెట్లు బుక్ చేసుకోండి.. అంటూ ప్రచారం చేసింది ఓ ప్రైవేట్ ట్రావెల్స్.. ఇంకేముంది.. సౌకర్యవంతంగా బస్సులో ప్రయాగ్‌రాజ్ వెళ్లొచ్చు.. అంటూ చాలా మంది వేలకు వేలు ఖర్చు చేసి టికెట్లు కొన్నారు.. స్లీపర్‌లో పడుకుని మరీ వెళ్లొచ్చని అనుకున్నారు.. కానీ సీన్ రివర్స్ అయింది.. బస్సు ఎక్కించుకున్న నిర్వాహకులు.. ప్రయాణికులను నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటన కలకలం రేపింది. ప్రయాగ్‌రాజ్‌లో జరిగే కుంభమేళాకి తీసుకువెళతామంటూ ధనుంజయ ట్రావెల్స్ ప్రయాణికులను ముంచేసింది. చివరకు నడిరోడ్డు పైనే ప్రయాణికులను వదిలేసి పరారయ్యారు ట్రావెల్స్ నిర్వాహకులు.. దీంతో ప్రయాణికులు మేడ్చల్‌లో గంటల తరబడి పడిగాపులు కాశారు.. ధనంజయ ట్రావెల్స్ దగా దందాతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు.
అసలేం జరిగిందంటే..
బెంగళూరు టు కుంభమేళా వయా హైదరాబాద్… స్లీపర్‌లో పడుకుని మరీ వెళ్లచ్చూ అంటూ తెగ ప్రచారం చేయడంతో ఒక్కొక్కళ్లు ఆరేడు వేలు పోసి టికెట్లు కొన్నారు. బెంగళూరు, కర్నూలు, హైదరాబాద్ వాసులు పెద్దఎత్తున బస్ టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో బస్ ట్రబుల్ ఇచ్చిందంటూ నిర్వాహకులు మరో బస్‌ను అరేంజ్ చేశారు.
అయితే, అది డొక్కు బస్సు కావడంతో డ్రైవర్‌పై ప్రయాణికులు మండిపడ్డారు. తాము స్లీపర్ బుక్ చేసుకుంటే, సెమీ స్లీపర్‌లో ఎలా వెళతామంటూ ప్యాసింజర్లు నిలదీశారు. ఏమాత్రం సౌకర్యం లేకుండా ప్రయాగ్‌రాజ్‌దాకా వెళ్లాలా అని ప్రయాణికులు నిలదీయడంతో, మేడ్చల్‌లో బస్సును వదిలేసి పారిపోయాడు డ్రైవర్..
దీంతో పదుల సంఖ్యలో ప్రయాణికులు గంటల తరబడి నడిరోడ్డుపై పడిగాపులు కాస్తూ నరకం అనుభవించారు. ప్రయాగ్‌రాజ్‌కి తీసుకు వెళతామని చెప్పి, తమను నడిరోడ్డు మీదే వదిలేశారంటూ, ధనుంజయ ట్రావెల్స్‌పై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ట్రావెల్స్ బస్సుపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..