సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు వివాదాల్లోనూ ఇరుక్కున్నారు ఆర్జీవీ. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శారీ’. టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ.. అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను ఆర్జీవీ ఎప్పటి నుంచో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం రామ్ గోపాల్ వర్మ ఓ సోషల్ మీడియా బ్యూటీని వెతికి మరీ పట్టుకొని సినిమా చేశారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో,ఆర్జీవి-ఆర్వి ప్రొడక్షన్స్ LLP బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త రవి శంకర్ వర్మ నిర్మిస్తున్నారు.
ప్రేమ చంపేస్తుంది.. అదే ప్రేమ ఎక్కువైతే భయమే.. ఎలాంటి అనర్థాలు జరుగుతాయి అనే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పలు నిజజీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా శారీ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆరాధ్య దేవి కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఈ సినిమాపై క్యూరియాసిటిని కలిగించాయి. ఆ మధ్య శారీ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. నార్మల్ గా చీరలోనే తిరిగే ఓ అందమైన అమ్మాయిని పిచ్చిగా ప్రేమించే అబ్బాయి.. ఆ ప్రేమ ఎక్కువై చివరకు సైకోగా ఎలా మారాడు అన్నది ఈ మూవీలో చూపించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్, సాంగ్స్, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమానుంచి సాంగ్స్ ను కూడా విడుదల చేస్తున్నారు ఆర్జీవీ. తాజా శారీ సినిమా నుంచి మరో సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆర్జీవీ డెన్ మ్యూజిక్’ ద్వారా సెకండ్ లిరికల్ సాంగ్ ‘ఎగిరే గువ్వలాగా…’ రిలీజ్ చేసామని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ షేర్ చేశారు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందమైన లిరిక్స్ తో పాటు హీరోయిన్ అందాలు కూడా తోడవడంతో ఈ సినిమా మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి