సహజంగానే వేసవిలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. డిమాండ్‌కు తగ్గ సప్లై చేయటానికి డిస్కంలు కసరత్తులు చేస్తుంటాయి. ఈసారి సమ్మర్ స్టార్ట్ కాకముందే ఈ కసరత్తును విద్యుత్ రంగ సంస్థలు ప్రారంభించాయి. గత ఏడాది మార్చిలో అత్యధికంగా 15 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడితే ఈసారి వేసవి రాకముందు జనవరిలోనే 15,205 మెగావాట్ల డిమాండ్ ఏర్పడింది. ఎండలు పూర్తిగా మొదలు కాకముందే ఈ రకమైన డిమాండ్ ఉంటే పిక్ సమ్మర్‌లో ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే కేవలం గృహ వినియోగం వల్లనే ఇంత డిమాండ్ పెరగలేదు. దీనికి పలు కారణాలు ఉన్నాయి.ఈసారి వర్షాలు బాగా పడి రికార్డ్ స్థాయిలో పంట దిగుబడి సాధించింది తెలంగాణ రాష్ట్రం. అందుకు వ్యవసాయ విద్యుత్ వినియోగం డిమాండ్ చాలా పెరిగింది. దాంతో పాటు పారిశ్రామిక గృహ వినియోగంలో కూడా భారీగా వృద్ధిరేటు కనపడింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ జనవరిలో పదివేల మెగావాట్ల విద్యుత్ రిమాండ్ ఏర్పడితే ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే 5000 మెగాపట్ల డిమాండ్ ఉంది. మొత్తం కలిపి 15 వేల మెగాపట్ల డిమాండ్ ఏర్పడింది. ఏడాది పీక్ సమ్మర్‌కి కనీసంగా 17000 నుంచి 18 వేల మెగావాట్ల పైచిలుకు డిమాండ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి
యాసంగితో పాటు రానున్న ఎండాకాలంలో డిమాండ్‌కు తగ్గట్టుగా క్వాలిటీ కరెంట్ సప్లై చేయడంపై తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు దృష్టి సారించాయి. విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ రంగ సంస్థలు ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూలు నిర్వహిస్తున్నాయి. విద్యుత్ శాఖ మంత్రి అయిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా సప్లై ఏ విధంగా ఉందనే అంశంపై మానిటర్ చేస్తున్నారు. ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు.
జనవరి 31న రికార్డు స్థాయిలో 15,205 మెగావాట్లు వినియోగం
గతేడాది జనవరిలో పీక్ డిమాండ్ 13,810 మెగావాట్లు కాగా ఈ సంవత్సరం జనవరి 31న రికార్డు స్థాయిలో 15,205 మెగావాట్లు నమోదైంది. ఇది గతేడాది పీక్ సమ్మర్‌లో ఉన్న డిమాండ్ కన్నా ఎక్కువ. పోయిన ఏడాది మార్చి మూడున అత్యధికంగా 15,623 మెగా డిమాండ్ ఏర్పడింది. డిమాండ్ ఎంత పెరిగిన దానికి తగ్గట్టుగా సరఫరా అందించేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. వేసవిలో విద్యుత్ డిమాండ్ తాకిడిని తట్టుకోవడానికి సీనియర్ ఇంజనీర్లను ప్రతి జిల్లాకు నోడల్ అధికారులు నియమించి, విద్యుత్ కంట్రోల్ రూమ్ 1912 బలోపేతం చేసి ఎప్పుడు ప్రజల్లోకి అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు.
డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తికి కసరత్తు
మరోవైపు పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సింగరేణి ద్వారా నిరంతరాయంగా రోజుకు 17 లక్షల క్యూబిక్ మీటర్ల బొగ్గు సరఫరా జరిగే విధంగా చూస్తున్నారు. దాంతోపాటు సోలార్ పవర్ల సామర్థ్యాన్ని కూడా పెంచాలని చూస్తున్నారు. ఇక పవర్ బ్యాంకింగ్ విధానం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ సరఫరా చేయగలమని అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలకు లో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి సప్లై చేసి ఇక్కడ డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు అక్కడి నుంచి దిగుమతి చేసుకునే విధానమే పవర్ బ్యాంకింగ్. ఉత్తర దక్షిణ భారతదేశానికి విద్యుత్ వినియోగ సీజన్లలో వ్యత్యాసాలు ఉండటంతో పవర్ బ్యాంకింగ్ విధానం ద్వారా పిక్ సమ్మర్ టైంలో డిమాండ్‌కు తగ్గ సప్లై చేయగలమని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..