Phani CH |
Updated on: Feb 12, 2025 | 5:12 PM
మనకు కనిపించే.. మన చుట్టూ ఉండే ప్రపంచం ఒకటే కావచ్చు.. కానీ ఫోన్‌లోకి తొంగి చూసినా.. సిస్టమ్ కీబోర్డ్ మీద వేలెట్టినా.. మనం ఎంటరయ్యే ప్రపంచం వేరు. అదే ఇంటర్నెట్. వెబ్ దునియా! రెండో ప్రపంచం! అయితే ఈ ప్రపంచంలో మనకు ప్రైవసీ లేదనేది వైరల్ టాపిక్ . సోషల్ మీడియా వేదికగా మన పార్టనర్స్‌తో.. మనం పంచుకునే విషయాలను కొంత మంది గమనిస్తున్నారన్నది గ్లోబల్ టాపిక్.
అయితే ఈ టాపిక్ మీదే ఇప్పుడో సినిమా వస్తోంది. హ్యాష్ ట్యాగ్ వైరల్ ప్రపంచం అనే సినిమా తెరకెక్కింది. రెండు జంటలు.. సోషల్ మీడియా వేదికగా వారు సాగించిన ప్రేమాయణం.. చెప్పుకున్న కబుర్లు. పంచుకున్న వీడియోలు.. వెబ్ దునియాలో ఎలా లీకైందనే స్టోరీతో.. దాని వల్ల వాళ్ల లైఫ్ ఎలా టర్న్ అయిందనే పాయింట్తో.. డైరెక్టర్ బ్రిజేష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ సినిమా అందరి ప్రశంసలు అందుకుంటోంది. తన్వీర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ అయింది. అంతేకాదు చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్, మాంట్రియల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ఈ మూవీని ప్రదర్శించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: రూ.73 కోట్ల తండేల్.. దంచికొడుతున్న చైతూ
రజినీకాంత్ సినిమాకే ఇలాంటి గతి పడితే ఎలా?
Raghavendra Rao: తండేల్ సినిమాపై రాఘవేంద్రరావు రివ్యూ
Daaku Maharaaj: దిమ్మతిరిగే న్యూస్.. ఎక్స్‌ట్రా కంటెంట్‌తో.. OTTలోకి డాకు మహరాజ్