2025-26 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు ముందుంచారు. ఈ బడ్జెట్‌లో అనేక రంగాల్లో సరికొత్త సంస్కరణలను తీసుకొచ్చారు. విద్య, వ్యవసాయం, టెక్నాలజీ రంగాలకు అనేక ప్రోత్సాహకాలను ప్రకటించారు. అయితే ఈ బడ్జెట్‌తో కొత్తగా ఏయే వస్తువుల ధరలు తగ్గనున్నాయనే అంశం ఇప్పుడు సామాన్యుల్లో ఆసక్తికరంగా మారింది.
మొత్తం 12 ఖనిజాలను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రాణాలను కాపాడే 36 మందులకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. అదే విధంగా కేన్సర్ చికిత్సకు సంబంధించిన మూడు మందులకు కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. నౌకల తయారీకి అవసరమైన ముడి సరుకులపై కూడా కస్టమ్స్ డ్యూటీని పదేళ్ల పాటు మినహాయింపు ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం :
పెళ్లికి వేళాయరా.. మంచి ముహుర్తాలు వచ్చేశాయ్!
రైల్వే ట్రాక్‌పై కూర్చొని ఫోన్‌లో మాట్లాడుతున్న యువకుడు.. ఇంతలో.. వీడియో