ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి పదో తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 11న పరిశీలన, 13న ఉపసంహరణ, 27న పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్చి 3న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పరిధిలోని 123 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓట హక్కు
Election Commission Of India
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి పదో తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 11న పరిశీలన, 13న ఉపసంహరణ, 27న పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్చి 3న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పరిధిలోని 123 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓట హక్కు వినియోగించుకుంటారు. ఈ ఎన్నికల్లో మొత్తం 21,555 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఓటరుగా నమోదై ఉండాలి. అభ్యర్థి జనరల్ అయితే రూ.10 వేలు/ ఎస్సీ,ఎస్సీలైతే రూ.ఐదువేలు డిపాజిట్‌గా చెల్లించాలి. పూర్తిచేసిన నామినేషన్ ఫారం, ఆస్తులు, అప్పులు, కుటుంబానికి చెందిన సమాచారంతో ఆఫిడవిట్, ఓటరుగా ఉన్న వివరాలను సంబంధిత అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి సంతకంతో కూడిన సర్టిఫికెట్‌ను రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. నామినేషన్‌పై ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఉన్న పదిమంది ఓటర్లు బలపరుస్తూ సంతకాలు చేయాల్సి ఉంటుంది.
నామినేషన్ల స్వీకరణ సమయంలో అభ్యర్థితోపాటు మరో నలుగురిని మాత్రమే రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లేందుకు పర్మిషన్ ఇస్తారు. నామినేషన్ల దాఖలు సమయంలో సందేహాలు నివృత్తి, ఇతరత్రా సహాయం కోసం కలెక్టరేట్ మొదటి అంతస్తుపైకి వెళ్లేటప్పుడు మెట్లకు ఎదురుగా ఉన్న చాంబర్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.