New Zealand Cricket Ferguson Injury Champions Trophy: పాకిస్తాన్, దుబాయ్‌లలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ముందు, ఆస్ట్రేలియాకు చెందిన నలుగురు పెద్ద ఆటగాళ్లను తొలగించారు. అదే సమయంలో, న్యూజిలాండ్‌కు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. కివీస్ జట్టులో 150 కి.మీల వేగంతో బౌలింగ్ చేసే లాకీ ఫెర్గూసన్‌పై నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి. గాయం కారణంగా, ఫెర్గూసన్ రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ, పాకిస్తాన్‌లో జరగనున్న ట్రై-నేషన్ సిరీస్‌కు దూరంగా ఉండవచ్చు.
లాకీ ఫెర్గూసన్‌కు ఏమైంది?
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ ఈ రోజుల్లో దుబాయ్‌లో ఇంటర్నేషనల్ లీగ్ టీ20 ఆడుతున్నాడు. క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో డెసర్ట్ వైపర్స్‌తో ఆడుతున్నాడు. అతను నాలుగు ఓవర్ల పూర్తి కోటాను బౌలింగ్ చేయలేకపోయాడు. స్నాయువు గాయం కారణంగా మైదానం నుంచి నిష్క్రమించాడు. దీంతో అతని స్థానంలో పాకిస్తాన్ ఆటగాడు మొహమ్మద్ ఆమీర్ బౌలింగ్ వేశాడు. ఆ తరువాత, ఫెర్గూసన్ మరుసటి రోజు స్కాన్ చేశారు. ఇప్పుడు ఈ నివేదిక బయటకు వచ్చింది.
న్యూజిలాండ్ కోచ్ ఏమన్నాడంటే?
ఈ విషయాన్ని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ తెలియజేస్తూ, ఫెర్గూసన్‌ను యూఏఈలో స్కాన్ చేశామని, ప్రస్తుతం తొడ కండరాలకు చిన్న గాయం అయినట్లు కనిపిస్తోంది. కాబట్టి, దీని గురించి నివేదిక వచ్చే వరకు మేం ఎదురు చూస్తుటాం. ఆ తర్వాతే భవిష్యత్తులో ఏదైనా నిర్ణయం తీసుకోగలుగుతాం అంటూ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి
ట్రై నేషన్ సిరీస్ ఎప్పుడు ప్రారంభం?
లాకీ ఫెర్గూసన్ గురించి చెప్పాలంటే, అతను ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జట్టులో న్యూజిలాండ్ నుంచి అత్యంత అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఇటువంటి పరిస్థితిలో, అతని గాయం న్యూజిలాండ్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలనుంది. న్యూజిలాండ్ తరపున ఫెర్గూసన్ ఇప్పటివరకు 65 వన్డేల్లో 99 వికెట్లు పడగొట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య ట్రై వన్డే సిరీస్ జరగనుంది. ఇది ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభమవుతుంది. చివరి మ్యాచ్ ఫిబ్రవరి 14న జరుగుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..