టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఇటీవలే సుకుమార్ పుష్ప 2తో భారీ విజయాన్ని అందుకున్నాడు. పుష్ప 2 వసూళ్లకు తగ్గట్టుగా ఐటీ చెల్లింపులు జరగలేదని అధికారులు నిర్ధారణ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలు కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
Sukumar
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఇటీవలే సుకుమార్ పుష్ప 2తో భారీ విజయాన్ని అందుకున్నాడు. పుష్ప 2 వసూళ్లకు తగ్గట్టుగా ఐటీ చెల్లింపులు జరగలేదని అధికారులు నిర్ధారణ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలు కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ పై కూడా ఐటీ అధికారులు దాడులు చేశారు . నిన్నటి నుంచి ఐటీ అధికారులు సినీ ప్రముఖుక ఇళ్లల్లో దాడులు చేస్తున్నారు.
ఇప్పటికే దిల్ రాజు, శిరీష్, మైత్రి మూవీ మేకర్స్, అలాగే మ్యాంగో మీడియా పై దాడులు చేశారు. ఇళ్లు, ఆఫీసులు ఏదీ వదలకుండా రైడ్స్ చేశారు అధికారులు. తాజాగా పుష్ప దర్శకుడు సుకుమార్ ఇంటి పై ఐటీ రైడ్స్ చేశారు. కాగా వసూళ్లకు తగ్గట్టుగా ట్యాక్స్ కట్టలేదని అధికారులు నిర్దారించారని తెలుస్తుంది.