టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇంట అన్నీ శుభ శకునాలే కనిపిస్తున్నాయి. గతేడాది అతను తన సహ నటి రహస్య గోరఖ్ ను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కిరణ్ నటించిన క సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. త్వరలోనే దిల్ రూబా అనే మరో ఆసక్తికర సినిమాతో మన ముందుకు రానున్నాడు కిరణ్.
అయితే ఇంతలోనే మరో శుభవార్త వినిపించాడీ ట్యాలెంటెడ్ హీరో. త్వరలో తాను తండ్రిగా ప్రమోషన్ పొందనున్నట్లు తెలిపాడు కిరణ్. ఈ సందర్భంగా గర్భంతో ఉన్న తన భార్య రహస్య గోరఖ్ తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడీ యంగ్ హీరో. తన భార్యతో దిగిన ఫోటోను షేర్ చేయడమే కాదు.. తమ ప్రేమ మరో రెండు అడుగులు పెరిగిందంటూ వారి ఫోటోకు క్రేజీ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. నెట్టింట ట్రెండ్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్టార్‌కు సాయం చేసిన ఆటో డ్రైవర్ కు రివార్డ్.. ఎంత ఇచ్చారంటే..
సింధు నదిలో టన్నుల కొద్దీ బంగారం.. పాక్ దశ తిరగనుందా ??
Akhanda 2: అఘోరాల మధ్య అఖండ -2 “తాండవం” షూటింగ్
ఈ ఆకులను చీప్‌గా చూడకండి.. నాలుగు ఆకులు తిన్నారంటే రోగాలన్నీ పరార్