భారతదేశంలో వజ్రాల మార్కెట్‌లో తగ్గుతున్న ఎగుమతులు, ఉద్యోగ నష్టాలను ఎదుర్కొంటున్న ఈ రంగాన్ని పునరుజ్జీవింపజేసేందుకు ఏప్రిల్‌లో ఈ పథకం అమల్లోకి రానుంది. ఈ పథకం ఎగుమతిదారులకు పలు ప్రోత్సాహకాలను అందిస్తుంది. డీఐఏ స్కీమ్ ¼ క్యారెట్ (25 సెంట్లు) కంటే తక్కువ ఉండే సహజ కట్, పాలిష్ చేసిన వజ్రాలను సుంకం రహితంగా దిగుమతి చేసుకోవచ్చు. ఎగుమతిదారులు కనీసం 10 శాతం యాడ్ ఆన్ అవసరాన్ని తీర్చగలరని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలుపుతుంది. వార్షిక ఎగుమతి ఆదాయం 15 మిలియన్ల డాలర్లకు మించి ఉన్న టూే స్టార్ ఎగుమతి సంస్థలు, అంతకంటే ఎక్కువ ఉన్న సంస్థలు మాత్రమే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. స్థానిక ప్రాసెసింగ్ తప్పనిసరి అయిన బోట్స్‌వానా, నమీబియా, అంగోలా వంటి వజ్రాలు అధికంగా ఉన్న దేశాల్లో కనిపించే గ్లోబల్ బెనిఫిసియేషన్ పద్ధతుల్లో భారత్‌ను నిలిచేలా చేస్తుందని చెబుతున్నారు. వజ్రాల వ్యాపారంలో అగ్రగామిగా ఉన్న భారతదేశం ప్రపంచంలోని 90% వజ్రాలను ప్రాసెస్ చేస్తుంది. అయినప్పటికీ ఈ మైనింగ్ దేశాల నుండి పెరుగుతున్న పోటీ, పెరుగుతున్న వ్యయాలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితితో పాటు, ఈ రంగాన్ని ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది.
డీఐఏ స్కీమ్ ఈ సవాళ్లను భారతీయ డైమంటెయిర్‌లకు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్‌ను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కంపెనీలు విదేశాలకు తమ కార్యకలాపాలను మార్చకుండా ఉండేలా ఈ స్కీమ్ ఉపయోగపడుతుందని వివస్తున్నారు. ఇన్‌పుట్ ఖర్చులను తగ్గించడం, కటింగ్, పాలిషింగ్ టెక్నిక్‌లలో ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా భారతదేశపు వజ్రాల పరిశ్రమను మారుస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ ఎగుమతిదారులకు మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రపంచ అగ్రగామిగా భారతదేశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహంతో పాటు ఉద్యోగ కల్పనను ప్రోత్సహిస్తుందని వివరిస్తున్నారు.
భారతదేశం ఎక్కువగా యూఎస్, హాంకాంగ్, యూఏఈతో సహా అనేక దేశాలకు వజ్రాలు, వజ్రాభరణాలను ఎగుమతి చేస్తుంది. భారతదేశ వజ్రాలు, వజ్రాభరణాల ఎగుమతులు 2024 ఆర్థిక సంవత్సరంలో మూడేళ్ల కనిష్ట స్థాయికి తగ్గాయి. అమెరికా, చైనా వంటి కీలక మార్కెట్ల నుంచి డిమాండ్ తగ్గడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. వాణిజ్య మంత్రిత్వ శాఖకు సంబంధించిన నిర్యాత్ పోర్టల్ నుంచి వచ్చిన డేటా ప్రకారం, రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 2024 ఆర్థిక సంవత్సరంలో 32.71 బిలియన్ల డాలర్లుగా ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో 37.96 బిలియన్ల డాలర్లు, 2022లో 38.94 బిలియన్ల డాలర్లకు తగ్గాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి