ఇప్పటికే అన్ని హంగులు, కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తండేల్ ఫిబ్రవరి 07న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా హైదరాబాద్ లోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. తాజాగా తండేల్ టీమ్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చిత్ర బృందం చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని తండేల్ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీలోని అన్ని సింగిల్ స్క్రీన్స్ లో జీఎస్టీతో కలిపి రూ.50, మల్టీప్లెక్స్ లో జీఎస్టీతో కలిపి రూ.75 పెంచుకునేలా ఆదేశాలిచ్చింది. సినిమా విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు ఈ అదనపు ధరలు అమలులో ఉండనున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం (ఫిబ్రవరి 05) అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహా కుంభమేళాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్..
ఎట్టకేలకు ‘టాక్సిక్’ సెట్‌లోకి స్టార్ హీరోయిన్..
కాఫీ చేదుగా ఉండడం వెనుక అసలు కారణం ఇదే!
సామాన్యుల కోసం లగ్జరీ రైళ్లు..మారిన కాజీపేట స్టేషన్ రూపురేఖలు