టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. ఒకప్పుడు నటుడిగా వరుసగా సినిమాలు చేసిన బండ్ల గణేష్ ఆతర్వాత నిర్మాతగా మారారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో కనిపించి ఆకట్టుకున్నారు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన బండ్ల గణేష్ .. సమయం దొరికినప్పుడల్లా ఆయనను తెగ పొగిడేస్తుంటారు. పవన్ కళ్యాణ్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కానీ బండ్లగణేష్ మాత్రం ఆయనకు భక్తుడు. కాగా నటుడిగా పదుల సంఖ్యలో సినిమాలు చేసిన బండ్ల గణేష్ నిర్మాతగా మారి చేసిన మొదటి సినిమా ఆంజనేయులు. ఈ సినిమా తర్వాత తీన్ మార్ , గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరమ్మాయిలతో సినిమాలు చేశాడు. ఇక బండ్లగణేష్ రాజకీయాలను కూడా టచ్ చేశారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బండ్లగణేష్ తన ట్వీట్స్ తో అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటారు.
తాజాగా మరోసారి బండ్ల గణేష్ తన ట్వీట్ తో వార్తల్లో నిలిచారు. నిర్మాత సింగనమల రమేష్ కు బండ్ల కౌంటర్ ఇచ్చారు. తాజాగా శింగనమల రమేష్ ప్రెస్ మీట్ పెట్టి పులి, ఖలేజా సినిమాలతో నాకు 100 కోట్ల నష్టం వచ్చిందని అన్నారు. అలాగే ఏడాది చేయాల్సిన సినిమాలు మూడేళ్లు అయ్యాయని రమేష్ బాబు అన్నారు. దానికి బండ్ల కౌంటర్ ఇచ్చారు.
” సింగనమల రమేష్ గారు మీరు సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు మీ కోసం పవన్ కళ్యాణ్ గారు మూడు సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని వందల కాల్షీట్స్ వేస్ట్ చేసుకున్నారు. ప్రత్యక్ష సాక్షి నేను. దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి ఇది కరెక్ట్ కాదు” అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సింగనమల రమేష్ గారు మీరు సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు మీ కోసం @PawanKalyan గారు మూడు సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని వందల కాల్షీట్స్ వేస్ట్ చేసుకున్నారు ప్రత్యక్ష సాక్షి నేను దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి ఇది కరెక్ట్ కాదు . https://t.co/LVGihOWIhI
— BANDLA GANESH. (@ganeshbandla) February 5, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి