సినిమా హీరోయిన్స్, సీరియల్ నటీమణుల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటే ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అంతే కాదు ఆమె మాములు సెలబ్రెటీ కాదు. ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటి ఆమె.. అలాగే సోషల్ మీడియాలోనూ రికార్డ్ స్థాయిలో ఫాలోవర్స్ ఉన్నారు.
Actress
చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు హీరోలకు మించి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. కొంతమంది హీరోయిన్స్ కోసమే సినిమాలకు వెళ్లే వారు కూడా ఉన్నారు. రీసెంట్ డేస్ లో చాలా మంది ముద్దుగుమ్మలు ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోయారు. దాంతోపాటు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ స్టార్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. సినిమా హీరోయిన్స్ మాత్రమే కాదు సీరియల్ బ్యూటీలు కూడా ఈ మధ్య తెగ ఫెమస్ అవుతున్నారు. హీరోయిన్స్ ను మించి క్రేజ్ తెచ్చుకున్న భామలు కూడా చాలా మంది ఉన్నారు. తాజాగా ఓ సీరియల్ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. ఎంతలా అంటే అంతా ఇంతా కాదు ఏకంగా స్టార్ హీరోలకు మించి ఫాలోవర్స్ ఉన్నారు ఆ అమ్మడికి.. అలాగే ఆమె ఆస్తిపాస్తులు కూడా స్టార్ హీరోలకు మించి ఉన్నాయి. ఇంతకూ ఆమె ఎవరంటే..
ఆమె వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే.. కానీ ఆమె ఆస్తి మాత్రం రూ. 250కోట్లకు పైగానే ఉంది. స్టార్ హీరోయిన్స్ కూడా ఇంత సంపాదించలేదు. అంతే కాదు ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న సీరియల్ నటి ఆమె. ఇంతకూ ఆమె పేరు ఏంటంటే.. ఆ సీరియల్ బ్యూటీ ఎవరో కాదు.. బాలీవుడ్ నటి జన్నత్ జుబేర్. చిన్న వయసులోనే ఈ అమ్మడు తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమెను ఫాలో అయ్యే వారు మిలియన్స్ లో ఉన్నారు. ఫాలోవర్స్ లో షారుక్ ఖాన్ ను కూడా బీట్ చేసింది ఈ చిన్నది.
జన్నత్ జుబేర్ కు ఇన్ స్టాలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 49.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా టీవీ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ గా మారిపోయింది. బాలీవుడ్ లో ఎన్నో సీరియల్స్ లో నటించి మెప్పింది ఈ ముద్దుగుమ్మ ఆలాగే రాణి ముఖర్జీ హీరోయిన్‌గా నటించిన ‘హిచ్కీ’లో జన్నత్ యాక్ట్ చేసింది. సీరియల్స్ తో పాటు పలు టీవీ షోల్లోనూ నటించి ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి. ఇక జన్నత్ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె ఒక్క ఫోటో షేర్ చేస్తే చాలు సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే.. ఆ అమ్మడి ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.