ప్రతి ఇంట్లోని ఏ వంట గదిలో చూసిన ఇప్పుడు అల్యూమినియం ఒక భాగమైంది. ప్రతి ఒక్కరూ కూడా దాదాపు అల్యూమినియం పత్రలలోనే వంట చేస్తుంటారు. కానీ అల్యూమినియం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రెండొందల ఏళ్ల క్రితం డెన్మార్క్ లో అల్యూమినియంను కనిపెట్టారు. కానీ ఆ అల్యూమినియం ఆ దేశంలో కంటే మన దేశంలోని వంటిళ్లలోకి ఎక్కువగా చొచ్చుకు పోయింది. దీని దెబ్బకు మట్టి, ఇత్తడి, కంచు, రాగి పాత్రలు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అల్యూమినియంను డెన్మార్క్‌కు చెందిన ఒక శాస్త్రవేత్త 1825 లో కనుగొన్నారు. భారత్ లో అల్యూమినియం ఉత్పాదన ఇండియన్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అనే సంస్థ 1938 లో ప్రారంబించింది. అప్పటినుంచి వీటి వాడకం విస్తృతమైంది. దీన్ని సామాన్యుల వంట పాత్ర అని చెప్పాలి. వీటిలో చేసే వంటకాల్లో అతిసూక్ష్మ మోతాదుల్లో అల్యూమినియం కరిగి ఉంటుంది ఆది ఆహారం తీసకున్న వారి శరీరాల్లోకి ప్రవేశిస్తుంది.
దీర్ఘకాలంగా అల్యూమినియం పాత్రల వాడకంతో ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా ఈ లోహానికి శరీర నిర్మాణంలో ఎలాంటి పాత్రా లేదు. అందుకే అధిక భాగం మూత్ర విసర్జన రూపంలో బయటికి వెళ్లిపోతుంది. కడుపులోకి వెళ్లిన అల్యూమినియంలో 0.01% నుంచి 1% వరకూ జీర్ణకోశంలోకి చేరుతుంది. దీన్ని మూత్ర పిండాలు బయటకు వెళ్లగొడతాయి. అయితే దీనికి కణజాలాల్లో పేరుకునే స్వభావం ఉండటం వల్ల ఎముకలు, మెదడు వంటి అవయవాలు దెబ్బతినే ప్రమాదముంది. ముఖ్యంగా దీర్ఘకాల కిడ్నీజబ్బుతో బాధపడేవారికి మరింత ఎక్కువ హాని చేయొచ్చు. ముఖ్యంగా టమాటా, నిమ్మ, చింతపండు వంటి పుల్లటి పదార్థాలతో చేసే వంటకాల్లో అల్యూమినియం ఎక్కువగా కరుగుతుంది. ఇనుము, మెగ్నీషియం, కాల్షియం వంటి మూలకాలు శరీర నిర్మాణ ప్రక్రియకు అవసరం. శరీరంలో పేరుకుపోయిన అల్యూమినియం ఇటువంటి ఉపయోగకరమైన లోహాలు మన దేహానికి ఉపయోగపడకుండా నిరోదిస్తుంది. దానితో రక్తహీనత, ఎముకలు మెత్తబడటం (ఆస్టియోమలేషియా), డయాలిసిస్ ఎన్ కెఫలోపతి అనే నాడీ మండల వ్యాధికి కారణమవుతుంది.
అల్యూమినియం మోతాదుకు మించి పేరుకుపోతే “డయాలిసిస్ ఎన్ కెఫలోపతి’ లేదా “డయాలసిస్ డిమెన్షియా” అనే వ్యాధికి గురయ్యే ప్రమాదముందని ఈ స్థితికి చేరిన వ్యక్తి మాట సరిగ్గా రాకపోవడం, జ్ఞాపకశక్తి మందగించడు, శరీర కదలికల్లో మార్పు, ప్రవర్తనలో తేడా వంటి దుష్ప్రభావాలకు లోనవుతారు. అల్జీమర్స్ వ్యాధి, రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులకు కూడా గురయ్య అవకాశాలు ఉన్నాయ్ అంటున్న వైద్యులు. ఒక మనిషి ఒక వారానికి వారి బరువులో ప్రతి కిలోకు 2 మిల్లీ గ్రాముల వరకు అల్యూమినియంను తీసుకున్నా శరీరం తట్టుకోగలదని ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఓ), ప్రపంచ ఆరోగ్య సంస్థలు సంయుక్తంగా నిర్ణయించాయి. అంతకు మించితే మాత్రం ప్రమాదమే. మనిషి శరీరంలోకి ఈ లోహం చేరడానికి అతి పెద్ద కారణం వంట పాత్రలు, అల్యూమినియం పాయిల్సే. ఇవి స్టీల్ పాత్రలతో పోలిస్తే మూడో వంతు సాంద్రత కలిగి ఉండి చాలా తేలిగ్గా ఉంటాయి. పాత్రలో పండుతున్న పదార్థాల ఆమ్లత లేదా క్షారత (పీహెచ్), ఎంత ఉష్ణోగ్రతపై వంట చేశారు. ఏ నూనె వాడారు. పాత్రను ఎంత సేపు పొయ్యిపై ఉంచారు వంటి అంశాలు వంటకంలో కలిసే అల్యూమినియం మోతాదును నిర్ణయిస్తాయి. ముఖ్యంగా పుల్లటి పదార్థాల్లో ఈ లోహం ఎక్కువగా కరుగుతుంది.
మూత్రపిండాల రోగంతో బాధపడుతున్న 30 మందికి 3 నెలల పాటు కేవలం స్టీలు పాత్రల్లో చేసిన వంటకాలు అందించారు. అదే కాలంలో మరో 12 మందికి అల్యూమినియం పాత్రల్లో చేసిన వంటకాలు పెట్టారు. స్టీలు పాత్రల్లో చేసిన వంటకాలు తిన్న వారి రక్తంలో, మూత్రంలో అల్యూమినియం పాళ్లు భారీగా తగ్గినట్టు వైద్యులు గుర్తించారు.