సినిమా ఇండస్ట్రీలో ఈ అమ్మడు ఓ స్టార్ హీరోయిన్.. అవకాశాలు వరుసగా వస్తున్నా కూడా అదృష్టం మాత్రం లేక సతమతం అవుతుంది ఈ చిన్నది. ఒకానొక సమయంలో వరుస హిట్స్ తో రాణించింది.. కానీ ఇప్పుడు హిట్స్ లేక కష్టపడుతుంది. అయినా కూడా ఈ ముద్దుగుమ్మకు క్రేజ్ ఎక్కడ తగ్గలేదు. ఒకొక్క సినిమాకు ఏకంగా నాలుగు కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటుంది. అంతే కాదు ఈ అమ్మడి నెట్ వర్త్ కూడా భారీగానే ఉంది.. ఆమె ఆస్తిపాస్తులు కూడా కోట్లల్లో ఉన్నాయి. తెలుగులోనే కాదు తమిళ్ హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఇంతకూ ఆ చిన్నది ఎవరో తెలుసా .? ఆమె నటించిన లేటెస్ట్ మూవీలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయినటించింది. కానీ ఆ సినిమా కూడా నిరాశపరిచింది. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.?
పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నదానికి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అభిమానులు ఉన్నారు. ఆ ముద్దుగుమ్మ ఎవరంటే.. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మడు తెలుగులో వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో దాదాపు అందరూ హీరోలు సరసన నటించి మెప్పించింది. ఈ మధ్య పూజా హెగ్డే నటించిన సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ బ్యూటీ చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి.
పూజా హెగ్డే నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. తెలుగు రాధేశ్యామ్, తమిళ్ లో బీస్ట్, హిందీలో సల్మాన్ ఖాన్ తో చేసిన ఇలా వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఆతర్వాత మహేష్ బాబు తో గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ వచ్చినా ఆ మూవీ నుంచి తప్పుకుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి కూడా తప్పుకుంది. ఇక కొంతకాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత రీసెంట్ గా బాలీవుడ్ లో దేవ్ అనే సినిమా చేసింది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. కానీ ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు దళపతి విజయ్ నటిస్తున్న సినిమాలో ఛాన్స్ అందుకుంది. అలాగే సూర్య హీరోగా నటిస్తున్న రెట్రో సినిమాలో నటిస్తుంది. ఈ బ్యూటీ ఒకొక్క సినిమా రూ. 4కోట్లు అందుకుంటుంది. అలాగే ఈ అమ్మడి నెట్ వర్త్ రూ. 50కోట్లు ఉంటుందని తెలుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి