2030 నాటికి 30 మెగావాట్ల అంతరిక్ష ఆధారిత సౌర విద్యుత్తు కేంద్రాన్ని ప్రారంభించాలనేది ఈ ఒప్పంద లక్ష్యం. సౌర విద్యుత్తు స్వచ్ఛమైనదే, పర్యావరణహితమైనదే అయినప్పటికీ ఉత్పత్తిలో పలు సమస్యలు ఉంటాయి. వాతావరణం ప్రతికూలంగా ఉండి, మేఘాలు ఏర్పడినప్పుడు సౌర విద్యుత్తు ఉత్పత్తి వీలు కాదు. ఈ సమస్యకు పరిష్కారంగా అంతరిక్ష ఆధారిత సౌర విద్యుత్తు కేంద్రాలను నిర్మించాలనే ప్రతిపాదన 1970ల నుంచి ఉంది. ఇంతకాలం ఆచరణసాధ్యం కాదని భావిస్తున్నా.. ఇప్పుడు స్పేస్ సోలార్, రేక్‌జావిక్ ఎనర్జీ ఈ విషయంలో ముందడుగు వేస్తున్నాయి. భూమికి 35,786 కిలోమీటర్ల దూరంలో జియోసింక్రోనస్ కక్ష్యలో ముందుగా ఫోటోవాల్టేయిక్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటుచేస్తారు. గాలి, మేఘాలు, ధూళి వంటి ఆటంకాలు లేకుండా నేరుగా ఇవి సూర్య కిరణాలను గ్రహించి విద్యుత్తుగా మారుస్తాయి. విద్యుత్తును సూక్ష్మ తరంగాలుగా మార్చి భూమి మీదకు పంపిస్తాయి. భూమి మీద ఏర్పాటు చేసిన రిసీవర్లు ఈ సూక్ష్మ తరంగాలను మళ్లీ విద్యుత్తుగా మార్చి గ్రిడ్లకు పంపిస్తాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జిల్ బైడెన్ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్ సతీమణి.. కారణం ఇదేనా ??
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్ విలువ ఇన్ని లక్షలా ??
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు.. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
ఇంటి పనుల్లో బిజీగా కుటుంబ సభ్యులు.. ఇంతలో ఊహించని సీన్ !!
మేఘాల్లో కలిసిపోతున్న మైక్రోప్లాస్టిక్స్ !! ఊహించని ఉత్పాతం తప్పదా ??