నాగ చైతన్య-సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తోన్న రెండో చిత్రం తండేల్. గతంలో వీరిద్దరూ జంటగా నటించిన లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు తండేల్ సినిమాలో మరోసారి జత కట్టారీ జోడి. చందూ మొండేటి లాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్, గీతా ఆర్ట్స్ బ్యానర్ కావడంతో మొదటి నుంచి తండేల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న తండేల్ మూవీ ఫిబ్రవరి 07న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇప్పటకే చెన్నై, వైజాగ్ తదితర చోట్ల ప్రమోషన్స్ నిర్వహించిన చిత్ర బృందం ఆదివారం (ఫిబ్రవరి 02) హైదరాబాద్ లో తండేల్ జాతర పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. శనివారమే జరగాల్సిన ఈ ఈవెంట్ అనివార్య కారణాలతో ఆదివారానికి వాయిదా పడింది. కాగా తండేల్ జాతర ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నాడని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో అభిమానులు కూడా తండేల్ ఈవెంట్ పై బాగా ఆసక్తి చూపించారు. పుష్ప 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ వస్తున్న తొలి మూవీ ఈవెంట్ కావడంతో బన్నీ ఏం మాట్లాడుతాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే చివరి నిమిషంలో తండేల్ జాతర నుంచి తప్పుకున్నాడు బన్నీ. దీనికి గల కారణాన్ని నిర్మాత అల్లు అరవింద్ వివరించారు.
‘తండేల్ జాతర ఈవెంట్‌కి బన్నీ గెస్టుగా రావాల్సి ఉంది. కానీ ఫారెన్ నుంచి వచ్చాడు. చాలా సివియర్‌గా గ్యాస్ట్రిటిస్ (గ్యాస్ పెయిన్) వచ్చింది.. అందుకే రాలేకపోయాడు.. మీ అందరికీ ఈ విషయం చెప్పమన్నాడు.. దయచేసి ఎవరూ అపార్థం చేసుకోకండి’ అని అల్లు అరవింద్ చెప్పారు. మొత్తానికి బన్నీ రాకపోవడంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు.
ఇవి కూడా చదవండి
‘Feb 7th..theatres lo..DHULLAKOTTEDHAM 💥💥’ -Yuvasamrat @chay_akkineni astatine the #ThandelJaathara ❤️🔥
▶️ https://t.co/DE7hWWSu6g#Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7th. #ThandelonFeb7th @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP @GeethaArts #AlluAravind @TheBunnyVas… pic.twitter.com/Y9LaNgqjTA
— Geetha Arts (@GeethaArts) February 2, 2025
నాగ చైతన్య, సాయి పల్లవిల డ్యాన్స్..
Yuvasamrat @chay_akkineni & @Sai_Pallavi92 creation to the chartbusters #HilessoHilessa & #NamoNamahShivaya astatine the #ThandelJaathara ❤️🔥
▶️ https://t.co/H8DTVj3CKy#Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7th. #ThandelonFeb7th @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP… pic.twitter.com/BaOkrYqxr9
— Geetha Arts (@GeethaArts) February 2, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.