కార్తికేయ 2 హిట్ తర్వాత డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న సినిమా తండేల్. అక్కినేని నాగచైతన్య, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో ఆదివారం నిర్వహించింది. ఈ వేడుకకు యానిమల్ ఫేస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా హైజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా విజయం అందుకోవాలని ఆకాంక్షిచారు. అలాగే విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాకు ముందుగా సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నామని చెప్పుకొచ్చారు.
సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ” తండేల్ టీజర్, ట్రైలర్ , సాంగ్స్.. ఏది చూసినా ఎమోషన్ కనిపిస్తోంది. చైతన్య, సాయి పల్లవి తమ పాత్రలలో ఒదిగిపోయారు. నేను కేడీ చిత్రానికి పని చేస్తున్న సమయంలో చైతన్యను చూశాను. ఆయన డ్రెస్సింగ్ స్టైల్, కార్ డ్రైవింగ్ నాకు చాలా ఇష్టం. కబీర్ సింగ్, యానిమల్ సినిమాల విషయంలో డిజైనర్ కు చైతన్య కాస్ట్యూమ్స్ రిఫెరెన్స్ గా చూపించేవాడిని. ప్రేమమ్ సినిమా నుంచి సాయి పల్లవికి అభిమానిగా మారిపోయాను. నేను తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా ముందు సాయి పల్లవి అనుకున్నాను. అందుకు ఓ కోర్డినేటర్ ను సంప్రదించాను. మీ సినిమాలో రొమాంటిక్ స్టోరీ ఎక్కడుంది.. ? ఆ విషయం మర్చిపోండి సర్.. ఆమె స్లీవ్ లెస్ డ్రెస్ కూడా వేయదు. అని చెప్పాడు. అవకాశాలు వస్తుంటే హీరోయిన్స్ మారిపోతుంటారు అనుకున్నాను. కానీ సాయి పల్లవి ఏం మారలేదు. చందూ నాకు ఆరేడేళ్లుగా పరిచయం. అక్కినేని అభిమానులకు ఈ సినిమా పండగే.. నేను మజిలీ మూవీ ఈవెంట్ కు వచ్చాను.. అది హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అంతే ” అని అన్నారు.
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. చైతూ, సాయి పల్లవి గురించి సందీప్ రెడ్డి చేసిన కామెంట్స్ విని ఫ్యాన్స్ ఫుల్ సంతోషిస్తున్నారు. తండేల్ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన