సుడి కలవడం అంటే ఇదే.. లచ్చిం దేవీ వెతుక్కుంటూ ఇంటికి రావడం అంటే ఇదేండోయ్.. ఒక్క చేపతో ఓ జాలరి లక్షాదికారిగా మారాడు. ఐదు, ఆరు నెలలు కష్టపడితే వచ్చే సొమ్ము ఒక్క రోజులోనే వచ్చింది. గంగమ్మకు బాగా మొక్కి.. వల వేసినట్టున్నాడు ఆ జాలరి. అందుకే అమ్మ కరుణించి.. సిరులు కురిపించింది.
కాకినాడ సముద్రతీరంలో మత్స్యకారుడు సముద్రంలో వేటకు వెళ్లాడు. అతని వలలో అత్యంత అరుదైన కచిడి చేప పడింది. ఇంకేముంది కుంభాభిషేకం రేవులో వేలం పెడితే.. ఏకంగా 3లక్షల 95వేల రూపాయలు పలికింది. దీంతో ఆ మత్స్యకారుడు ఆనందంలో ఉబ్బితబ్బివుతున్నాడు.
ఈ కచిడి చేప మాంసం చాలా రుచిగా ఉంటుంది. కానీ.. వండుకుని తిని ఆరగించడమే కాదు.. ఈ చేపతో మిగతా బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయ్. పొట్ట విప్పి చూడ.. 2 వేల నోట్ల కట్టలుండు అన్నట్టు.. ఈ చేపగారి పొట్ట భాగం చాలా కాస్ట్‌లీ అట. మగ కచిడి చేప ఉదరభాగంలో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. అందుకే ఈ చేపకు మార్కెట్లో మంచి డిమాండ్. వ్యాపారులు దీన్ని దక్కించుకునేందుకు పోటీ పడతారు. ఈ కచిడి చేపను గోల్డెన్ ఫిష్ అని కూడా అంటుంటారు. సర్జరీ తర్వాత డాక్టర్లు కుట్లు వేసే దారాన్ని వీటి నుంచే తయారు చేస్తారు. చేప పొట్టభాగం నుంచి తయారుచేసే ఈ దారం సమయం గడిచే కొద్దీ బాడీలో కలిసిపోతుంది. ఇక కాస్ట్లీ వైన్ తయారు చేసే ప్రాసెస్‌లోనూ కచిడి చేపను యూజ్ చేస్తారు. అందుకే ఈ చేపకు ఇంత క్రేజ్.
సముద్ర జలాల్లో అరుదుగా దొరికే ఈ కచడీ చేపను మత్స్యకారులు గోల్డెన్ ఫిష్‌గా పిల్చుకుంటారు. మామూలు చేపలంత ఈజీగా ఇవి వలకు చిక్కవు. సముద్ర జలాల్లో కొన్ని చోట్ల మాత్రం ఇవి సంచరిస్తుంటాయ్. కచిడి చేపల్లో మగ కచిడీ చేప అయితే బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంటుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..