తెలుగు సినీ పరిశ్రమలో హాస్యబ్రహ్మగా గుర్తింపు తెచ్చుకున్నాడు బ్రహ్మానందం. కొన్ని దశాబ్దాలుగా వందలాది సినిమాల్లో నటిస్తూ ఎంతో మంది హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా స్టార్ హీరోలతోపాటు పాపులారిటీ అందుకున్న కమెడియన్ ఆయన. అలాగే స్టార్ హీరోల కంటేఎక్కువగా పారితోషికం తీసుకున్న హాస్యనటుడు కావడం విశేషం. ఇప్పటివరకు దాదాపు 1200లకు పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నారు. తన ప్రత్యేకమైన ఎక్స్‌ప్రెషన్స్, పర్ఫెక్ట్ టైమింగ్, నవ్వించే డైలాగ్స్‌తో 30 ఏళ్లుగా కోట్లాది మంది అభిమానులను అలరించాడు. సినీ హాస్య ప్రపంచంలో ఆయన లెజెండ్ గా చేసింది తన అద్భుతమైన నటనే. తెలుగు లెక్చరర్ అయిన బ్రహ్మానందం హాస్యం, యాక్టింగ్ పట్ల ఆసక్తి ఉండడంతో సినీరంగంవైపు అడుగులు వేశారు.
అహ నా పెళ్లంట సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. 1987లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఇప్పటివరకు 1200కు పైగా సినిమాల్లో నటించడంతో ఆయనకు అత్యధిక స్క్రీన్‌లలో కనిపించినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను అందుకున్నాడు. బ్రహ్మానందం కేవలం కామెడీ కింగ్ మాత్రమే కాదు, భారతదేశంలోని అత్యంత సంపన్న హాస్యనటులలో ఒకరు. ఆయన ఆస్తులు దాదాపు రూ.800 కోట్లు ఉంటుందని అంచనా. ఇక ఆయన ఒక్క సినిమాకు దాదాపు రూ.2 కోట్లు పారితోషికం తీసుకుంటారని సమాచారం.
అంతేకాకుండా భారతదేశంలో అనేక చోట్ల రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టారు. ఆయనకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో విలాసవంతమైన ఇల్లు ఉంది. అలాగే బ్రహ్మానందం వద్ద Audi R8, Audi Q7, Mercedes-Benz వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. 2009లో భారతదేశ అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మ శ్రీ అవార్డు అందుకున్నారు. అలాగే ఉత్తమ హాస్య నటుడిగా ఆరు నంది అవార్డులు సంపాదించారు. అలాగే ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, సైమా అవార్డ్స్ అందుకున్నారు. బ్రహ్మానందం ఫోటోస్, మూవీ క్లిప్స్ సోషల్ మీడియాలో మీమ్స్, GIF ల ద్వారా ప్రేక్షకులను అలరిస్తాయి. అందుకే అతడిని మీమ్స్ దేవుడు అంటారు.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన