భారతదేశంలో ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్ల వాడకంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అయితే కాల్స్ చేయాలంటే కచ్చితంగా రీచార్జి ప్లాన్స్ కావాలి. కానీ కొన్ని అత్యవసర సమయాల్లో ఎలాంటి రీచార్జ్ ప్లాన్ లేకుండానే కాల్స్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉందని చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో ఫ్రీగా కాల్స్ చేసుకునే సదుపాయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Call Talking
Srinu |
Updated on: Feb 07, 2025 | 3:47 PM
భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ), బీఎస్‌ఎన్ఎల్ నెట్ వర్క్‌లను ఉపయోగిస్తున్న వారు ఎలాంటి రీచార్జీ లేకుండానే కాల్స్ చేసుకునే సదుపాయం ఉంది. ముఖ్యంగా ఖరీదైన రీచార్జ్ ప్లాన్‌లను పదే పదే రీఛార్జ్ చేసుకోవడంలో అలసిపోతే ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గం ఉందని నిపుణులు చెబుతన్నారు. మీ నంబర్‌ను పనిలోకి తీసుకురావడానికి ఇక్కడ ఒక ట్రిక్ ఉందని చెబుతున్నారు. ఎలాంటి రీఛార్జ్ అవసరం లేకుండా యాక్టివ్ ఉచిత కాల్స్ లభిస్తాయి. మీకు కావాల్సిందల్లా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్, వైఫై కాలింగ్ మాత్రమే. కనెక్ట్ అయి ఉన్నప్పుడు అనవసరమైన రీఛార్జ్‌లను నివారించడానికి ఈ ఫీచర్ మీకు సహాయపడుతుంది.
చాలా ఆధునిక స్మార్ట్‌ఫోన్‌లు వైఫై కాలింగ్ ఫీచర్‌తో వస్తాయి. దీని వల్ల వినియోగదారులు మొబైల్ నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అంటే మీ రీఛార్జ్ ప్లాన్ గడువు ముగిసినప్పటికీ మీరు ఇంట్లో వైఫై కనెక్షన్ ఉన్నంత వరకు కాల్స్ చేయడం కొనసాగించవచ్చు. అనుకోని సందర్భంలో బ్యాలెన్స్ అయిపోతే ఎలాంటి రీచార్జీ లేకుండానే ఈ ఫీచర్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
వైఫై కాలింగ్ యాక్టివేషన్ ఇలా
- మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లను తెరవాలి. అనంతరం నెట్‌వర్క్ & ఇంటర్నెట్ సెట్టింగ్‌లకు వెళ్లాలి.
- సిమ్ కార్డ్ & మొబైల్ నెట్‌వర్క్‌ను ఎంచుకోవాలి. అయితే మీరు కాల్ చేయడానికి ఉపయోగించే సిమ్ కార్డును ఎంచుకోవాలి.
- కిందకి స్క్రోల్ చేసి వైఫై కాలింగ్ టోగుల్‌ను ఎంచుకోవాలి. అనంతరం వైఫై కాలింగ్‌ను యాక్టివేట్ చేయాలి.
- యాక్టివేట్ అయిన తర్వాత, మొబైల్ నెట్‌వర్క్ బలహీనంగా ఉన్నప్పుడు లేదా మీ పరికరాల్లో అందుబాటులో లేనప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ కాల్‌ల కోసం ఆటోమెటిక్‌గా వైఫైను ఉపయోగిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి