Gold Price: బంగారం ధర రన్ రాజా రన్ అంటూ పట్టపగ్గాల్లేకుండా పరుగు పెడుతోంది. నెల రోజుల వ్యవధిలో ఏకంగా 8 వేలు పెరిగింది. 24క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర ఇవాళ 86 వేలు దాటింది. ఈ దూకుడు ఇంతటితో ఆగుతుందా? లక్ష మార్క్‌ను టచ్ చేస్తుందా? అసలే మాఘమాసం.. తెలుగురాష్ట్రాల్లో మార్చి 26 వరకు లక్షలాది వివాహాలు జరగనున్నాయి. ఈ క్రమంలో పెరిగిపోతున్న బంగారం ధరలు చూసి ఆడపిల్లల తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు.
అమెరికాలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక యూఎస్ డాలర్ బలపడుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు ఇండియాలో పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నారు. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఇదే సమయంలో దేశీయ ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ముందు ముందు 10 గ్రాముల బంగారం ధర లక్ష దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. వెండి ధర కూడా లక్షకు చేరుకుంటుంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే లక్ష 10 వేల రూపాయలకు చేరువలో ఉంది.
ఇది కూడా చదవండి: Toll Plaza: హై-స్పీడ్ హైవేలలో టోల్ అడ్డంకులకు వీడ్కోలు.. త్వరలో కొత్త ఫీచర్
బడ్జెట్‌కు ముందు నుంచే బంగారం, వెండి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇన్వెస్టర్లు, సాధారణ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో అస్థిరత, అమెరికన్ విధానాల కారణంగా ప్రజలు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం కొనుగోలును పెంచుతున్నారు. దీని కారణంగా దాని ధర నిరంతరం పెరుగుతోంది. వడ్డీరేట్లను తగ్గించడంతోపాటు ప్రపంచ మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగితే బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, వివాహాలు, పండుగ సీజన్లలో వారి డిమాండ్ ఎక్కువగా ఉండవచ్చు, దీని కారణంగా ధరలు అధిక స్థాయిలో ఉండవచ్చు.
ఇది కూడా చదవండి: Jio AirFiber: జియో అదిరిపోయే గుడ్‌న్యూస్.. రూ.599కే ఇంటర్నెట్, 12 ఓటీటీలు, 800కుపైగా టీవీ ఛానళ్లు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి