డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన చిత్రం తండేల్. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న అడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్య్సలేశం గ్రామ ప్రజల జీవితం ఆధారంగా వాస్తవ సంఘటనలతో ఈ సినిమాను రూపొందించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొన్ని రోజులుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న చిత్రయూనిట్.. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో తండేల్ జాతర ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, నిర్మాత దిల్ రాజ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.. “తన సినిమాలే కాదు.. సందీప్ వంగా ఇంటర్వ్యూల్లో మాటలు కూడా ఎంతో నిజాయితీగా, వాస్తవికంగా ఉంటాయి. తను ఈ వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ దర్శకులతో, నిర్మాతలతో పనిచేయాలని ప్రతి నటుడి దగ్గర ఓ జాబితా ఉంటుంది. అలాంటి నా జాబితాలో గీతా ఆర్ట్స్ ఉంటుంది. బన్నీ వాసుతో నా ప్రయాణం ఎప్పటినుంచో మొదలైంది. తండేల్ రాజు పాత్రకీ, నా నిజ జీవితానికీ చాలా వ్యత్సాసం ఉంటుంది. కానీ పాత్రకు తగ్గట్లుగా మారిపోవడానికి నాకు కావాల్సినంత టైమ్ ఇచ్చారు. ఎంతో ఓపికగా నాతో కలిసి ప్రయాణం చేశారు. ఇప్పటివరకు మేం ఎక్కడికి వెళ్లినా సాయి పల్లవితో కలిసి పనిచేయాలని అంటారు. ఇలాంటి నటిని నేను చూడలేదు. బుజ్జితల్లి పాటతో విడుదలకు ముందే ప్రేక్షకులలోకి సినిమాను తీసుకెళ్లారు డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ” అని అన్నారు.
‘ఇంట్లో శోభితను బుజ్జితల్లి అనే పిలుస్తుంటాను. ఈ సినిమాలో కథానాయికనీ అలాగే పిలుస్తుంటాను. తండేల్ సినిమా నుంచి బుజ్జితల్లి అనే పాట రావడంతో ఆమె ఫీలైంది’ అంటూ నవ్వులు పూయించారు చైతూ.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన