మన దృష్టిని గందరగోళం చేసి మన మెదడును యాక్టీవ్ చేసే మ్యాజిక్ ఇమేజ్ లు ఈ ఆప్టికల్ ఇల్ల్యూషన్ ఇమేజ్ లు. ఈ ఇల్ల్యూషన్ ఇమేజ్ ల ద్వారా మన దృష్టి సామర్థ్యం, ఆలోచనాత్మక శక్తి పెరిగిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. నిరంతరం ఇలాంటి ఇమేజ్ లు చూసి వాటిలో దాగివున్న సమాధానాన్ని కనుగొనడం వల్ల మన దృష్టి సామర్థ్యం మెరుగుపడుతుంది.
మన ఆలోచన ఎలా ఉందో, ఆ ఇమేజ్ ని మనం ఏ కోణంలో చూస్తున్నామో ఆధారపడి మన స్వభావాలను కూడా చెప్పవచ్చట. ఈ కారణంగానే ఈ తరహా ఇమేజ్ లు ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక మన టాస్క్ విషయానికి వస్తే.. సీతాకోకచిలుక కనుగొనడం చాలా సులభం అనుకోవడం పక్కా కాదు. మీ దృష్టికి, మెదడుకు సవాలు ఇవ్వడానికి ఈ ఇల్ల్యూషన్ ఇమేజ్. కాబట్టి మీ మెదడును కరెక్ట్ గా అడిగి సమాధానాన్ని కనుగొనండి. అది కూడా కేవలం 6 సెకన్లలో మాత్రమే.
కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా.. ఒక్కటి.. రెండు.. మూడు.. నాలుగు.. ఐదు.. ఆరు.. టైమ్ ఓవర్ 100లో 50 శాతం మంది సీతాకోకచిలుక ఉండే చోటు కనుగొన్నారని ఆశిస్తున్నాం. మీకు అభినందనలు. మీరు జీనియస్ అని నిరూపించుకున్నారు. కానీ కనిపెట్టనివారు మరలా ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి. సీతాకోకచిలుక ఎక్కడుందో తెలుసుకోవడానికి ఇమేజ్ మొత్తం జల్లడపట్టండి. అయినా మీకు దాగివున్న సీతాకోకచిలుక కనపడటం లేదా.
మీరు ఈ ఇమేజ్ ని మరొకసారి బాగా చూడండి. ఈ చిత్రంలో అందంగా రంగు రంగులు పక్షులు ఉన్నాయి కదా. చెట్టుపై కూర్చున్న ఈ రంగురంగుల పక్షుల మధ్య చెట్టు ఆకులు కనిపిస్తున్నాయి చూస్తున్నారా. అక్కడ పువ్వులు కూడా ఉన్నాయి కనిపిస్తున్నాయ. పైకి ఆకాశం కనిపిస్తోంది. కానీ మీరు అడిగిన సీతాకోకచిలుక మాత్రం కనపడట్లేదని ఆందోళన చెందకండి. ఇమేజ్ అంతా కాకుండా ఇమెజ్ లో లెఫ్ట్ సైడ్ ను మాత్రమే చూడండి. అది కూడా పక్షుల మధ్య. ఇంకా కనిపెట్టలేదా.. సరే అయితే చూడండి ఇక్కడే ఉంది అందమైన సీతాకోకచిలుక.