పిస్తాపప్పులో జింక్ అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్ B6 రోగనిరోధక పనితీరుకు అవసరమైన ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులోని సెలీనియం యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది..
Updated on: Feb 06, 2025 | 4:55 PM
కొన్ని ఆహారాలు వాతావరణాన్ని బట్టి మన శరీరానికి మేలు చేస్తాయి. ఈ ఆహారాలు మన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అటువంటి వాటిల్లో పిస్తాపప్పు ఒకటి. పిస్తాపప్పు శీతాకాలంలో శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
1 / 5
పిస్తాపప్పులో జింక్ అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్ B6 రోగనిరోధక పనితీరుకు అవసరమైన ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులోని సెలీనియం యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది.
2 / 5
పిస్తాపప్పులోని జింక్ వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని, తీవ్రతను తగ్గిస్తుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం పిస్తాపప్పు సంతృప్తికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం. ఇది మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. పిస్తాపప్పులో AMD.. కంటిశుక్లాలు, కళ్ళపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కంటి దృష్టిని కాపాడుతుంది.
3 / 5
పిస్తాపప్పులోని పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్లు రోగనిరోధక కణాల కార్యకలాపాలను పెంచుతుంది. ఇందులోని ప్రీబయోటిక్ లక్షణాలు పేగులోని బ్యాక్టీరియాను పోషిస్తుంది. ఇది శ్లేష్మ పొర రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
4 / 5
ఇన్ని రకాలుగా ఉపయోగపడే పిస్తాపప్పును మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవడం చాలా అవసరం. పిస్తాపప్పులోని పోషక విలువలు ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు అవసరమైన పోషకాలను అందిస్తాయి. దీనిని సలాడ్లు, ఇతర డెజర్ట్‌లలో కూడా వేసుకోవచ్చు.
5 / 5