దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా లేడీ డాక్టర్ హత్యాచార ఘటనలో కోర్టు తీర్పును వెల్లడించింది. నిందితుడు సంజయ్‌రాయ్‌ను దోషిగా నిర్ధారించింది సీల్దా కోర్టు.. సోమవారం ఉదయం 10.30 గంటలకు సంజయ్‌రాయ్‌కు శిక్షను ఖరారు చేయనుంది. 120 మంది సాక్ష్యులను విచారించిన కోర్టు తీర్పును వెల్లడించింది. సీబీఐ ఇచ్చిన ఆధారాలతో కోర్టు తీర్పును వెల్లడించింది. కోర్టు తీర్పు తరువాత గట్టి భద్రత మధ్య సంజయ్‌రాయ్‌ను జైలుకు తరలించారు.. అయితే తాను ఏ నేరం చేయలేదని , అన్యాయంగా కేసులో ఇరికించారని ఆరోపించాడు సంజయ్‌రాయ్.
———–ఆగస్టు 8, 2004 రాత్రి————–
కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్… సెకండియర్ పీజీ చేస్తున్న 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్.. నైట్ డ్యూటీ తర్వాత కొలీగ్స్‌తో కలిసి సెమినార్ హాల్‌లో డిన్నర్ చేసింది. 36 గంటలు డ్యూటీ చేసి అలసిపోయి.. రెస్ట్ కోసం అదే సెమినార్ హాల్‌లోకి వెళ్లి చిన్నకునుకు తీసింది. అంతే.. తెల్లారేసరికి వళ్లంగా గాయాలతో రక్తపు మడుగులో తేలింది.
———–ఆగస్టు 9, 2004 ఉదయం————– మరుసటిరోజు ఉదయాన్నే తోటి డాక్టర్లు పోలీసులకు ఇన్‌ఫామ్ చేశారు. ప్రాధమిక దర్యాప్తు కూడా జరిగింది. తీరా 11 గంటలకు నింపాదిగా మృతురాలి తండ్రికి ఫోన్ చేసి.. మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది త్వరగా రండి.. అంటూ కబురును చల్లగా చెప్పారు. వెంటనే ఆస్పత్రికి చేరుకున్న పేరెంట్స్‌ని మాట్లాడిన ఆర్‌జీ కార్ అసిస్టెంట్ సూపరింటెండ్.. ఆత్మహత్య అనే చెప్పారు. తమ కూతురి మృతదేహాన్నయినా చూపించమని అడిగినా తాత్సారం చేశారు. చివరకు ఒక ఫోటో తీసుకునే అవకాశమిచ్చారు. కూతురిని ఆ పరిస్థితిలో చూసి తల్లడిల్లిన పేరెంట్స్.. ఆ ఫోటోను తన బంధువులకు పంపారు.
———–ఆగస్టు 9, 2004 మధ్యాహ్నం————– మృతురాలి కాళ్లు 90 డిగ్రీలకు నిలువునా విడదీసి ఉన్నాయి. కళ్లల్లో గాజుముక్కలు.. మొహం మీద గాట్లు.. వంటి నిండా గాయాలు. అది ఆత్మహత్య కాదు.. హత్య అని ఇట్టే తెలిసిపోతోంది. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ కూడా అదే చెబుతోంది. అరవకుండా ఉండడం కోసం ఆమె నోరు, గొంతు గట్టిగా అదిమారని, థైరాయిడ్ గ్రంధి విరిగిపోయిందని, శరీరం మీద అనేక చోట్ల గాయాలున్నాయని, కడుపు, నోరు, కళ్లు బ్లీడింగ్ అవుతున్నాయని చెప్పింది ఎటాప్సీ రిపోర్ట్. ఇది ఆత్మహత్య కానేకాదు దారుణంగా అత్యాచారం చేసి, కిరాతకంగా చంపేశారు అనేది.. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ చూశాకే మిగతా ప్రపంచానికి తెలిసింది.
———–ఆగస్టు 9, 2004 సాయంత్రం————– ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్న అధికారుల తీరు మీద అనుమానం పెరిగి.. కోల్‌కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో డాక్టర్ల ఆందోళన మొదలైంది. ఈ నిరసన కోల్‌కతా మొత్తం వ్యాపించింది. డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్‌ని దారుణంగా చంపడాన్ని తేలిగ్గా తీసుకోవద్దని, కారకులైన అధికారులందరూ తప్పుకోవాలని డిమాండ్లు హోరెత్తాయి.
———–ఆగస్టు 10, 2004 ————– ఆందోళన, అనుమానం ఇలా బలపడుతుంటే.. అటు ప్రాధమిక దర్యాప్తు కూడా అంతే స్పీడుగా జరిగింది. ఘటనాస్థలంలో దొరికిన బ్లూటూత్ హెడ్‌ఫోన్ కీ ఎవిడెన్స్‌గా మారి.. సీసీ ఫుటేజ్ పరిశీలించడంతో కేసులో కదలిక మొదలైంది. ఆ రోజు రాత్రి . ఎవరెవరు వచ్చారని ఆరా తీస్తే.. కనిపించిన ఒకేఒక్క అనుమానితుడు.. సంజయ్‌రాయ్. వీడు 4 గంటలకు ఆస్పత్రిలోకి వచ్చినట్టు, 40 నిమిషాల తర్వాత బైటికొచ్చినట్టు, వచ్చేటప్పుడు అతడి దగ్గర బ్లూటూత్ హెడ్ సెట్ లేనట్టు గ్రహించిన పోలీసులు.. సరిపోల్చి చూస్తే.. ఇతడే ఆ దుర్మార్గుడు అని తేలింది.
…అసలు ఎవడీడు?….
సంజయ్‌రాయ్.. సివిక్ సర్వీస్ వాలంటీర్.. కాంట్రాక్ట్ ఉద్యోగి.. నెలకు 12 వేల జీతం. పోలీసులకు హెల్పర్‌గా ఉంటాడు. పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా అపోజిషన్ లీడర్ల మీద నిఘా పెడుతూ.. అప్పుడప్పుడూ ట్రాఫిక్ డ్యూటీ చేస్తూ.. అనారోగ్యంతో ఉన్న పోలీసులకు సాయం చేస్తూ ఉంటాడు. కాన్‌స్టబుల్స్‌కి ఉండే అన్ని రకాల వెసులుబాట్లూ ఉంటాయి గనుక.. కోల్‌కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో ప్రతీ వార్డుకీ, ప్రతీ డిపార్ట్‌మెంట్‌కీ చాలా ఈజీగా ఎంట్రీ అయ్యేవాడు.
వీడికి గతంలో నాలుగుసార్లు పెళ్లిళ్లయ్యాయి.. బిహేవియర్ నచ్చక ముగ్గురు భార్యలు వెళ్లిపోతే.. నాలుగో భార్య క్యాన్సర్‌తో చనిపోయింది. పోర్న్ వీడియోలు చూడ్డం వీడికున్న మరో హాబీ. ఘటన జరిగిన రోజు రాత్రి ఒంటిగంటకు కొందరితో కలిసి అక్కడే లిక్కర్ తీసుకున్నాడు. తర్వాత చెస్ట్ మెడిసిన్ బిల్డింగ్ దగ్గరకు వెళ్లి.. సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుంటున్న మహిళా డాక్టర్‌ని కిరాతకంగా రేప్ చేసి చంపేశాడు. డాక్టర్‌ని ఎటాక్ చేయడంలో వీడికున్న బాక్సింగ్ టాలెంట్‌ని కూడా ఉపయోగించాట్ట.