లేటెస్ట్ సెన్సేషన్ , లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి వరుస విజయాలతో దూసుకుపోతుంది. కంటెంట్ ఉన్న సినిమాలు, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది సాయి పల్లవి. అమరన్ సినిమాతో తమిళ్, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది. తాజాగా తండేల్ సినిమాతో పేక్షకుల ముందుకు వచ్చింది. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ సినిమా అందమైన ప్రేమకథ చిత్రంగా తెరకెక్కింది. ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే సాయి పల్లవిని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పర బాషా హీరోయిన్ గా చూడరు. తొలి తెలుగు సినిమాతోనే మన అమ్మయే అనిపించుకుంది.
ఫిదా సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. కాగా సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తే ఆమె పాత్ర సినిమాకే హైలైట్ అవుతుంది. అంతే కాదు ఆ సినిమాలో స్టార్ హీరో నటించినా కూడా సాయి పల్లవి వైపే అందరి కళ్లు వెళ్తాయి. ఆమె గురించే అందరూ మాట్లాడుకుంటారు. కానీ ఇప్పుడు సాయి పల్లవిని ఓ హీరో డామినేట్ చేశాడు. ఆహీరో ఎవరో కాదు అక్కినేని అందగాడు నాగ చైతన్య.
సాయి పల్లవి నాగ చైతన్య కలిసి లవ్ స్టోరీ, రీసెంట్ గా తండేల్ సినిమాల్లో నటించారు. లవ్ స్టోరీ సినిమాలో నాగ చైతన్య తన నటనతో ఆకట్టుకున్నాడు. కాగా రీసెంట్ గా విడుదలైన తండేల్ సినిమాలో మాత్రం చైతూ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా మత్యకారుడిగా పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. తండేల్ రాజుగా తన నటనతో మెప్పించాడు. సినిమా చూసిన అందరూ నాగచైతన్య నటనను మెచ్చుకుంటున్నారు. అలాగే ఇన్ని భాషల్లో నటించిన సాయి పల్లవిని డామినేట్ చేసిన ఏకైక హీరో నాగ చైతన్య అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్ . సినిమా చూసిన చాలా మంది అది నిజమే అని అంటున్నారు. కాగా తండేల్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది ఈ సినిమా. దేవీ శ్రీ అందించిన సంగీతం సినిమాకు వన్ ఆఫ్ ది హైలైట్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి