బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను తన ఇంట్లోనే కత్తితో పొడిచిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి చేసిన వ్యక్తి బంగ్లాదేశ్ పౌరుడని విచారణలో తేలింది. ఘటన జరిగిన 70 గంటల తర్వాత ఎట్టకేలకు ముంబై పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బుధవారం అర్థరాత్రి బాంద్రాలోని సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడిన నిందితులు కత్తితో నటుడిపై దాడి చేశారు. నిందితుడు వరుసగా ఆరుసార్లు కత్తితో పొడిచి పరారయ్యాడు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో సైఫ్ అలీఖాన్ ప్రాణాలను కాపాడంతో ఓ ఆటో డ్రైవర్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఆ ఆటో డ్రైవర్ మీడియాతో మాట్లాడాడు. సైఫ్ అలీఖాన్ ఇంట్లో కోటి రూపాయల విలువ చేసే లగ్జరీ కార్లు ఉన్నాయి. అయితే అలాంటి సమయంలో సైఫ్‌కి ఓ ఆటో సాయంగా వచ్చింది. ఆ రాత్రి, సైఫ్ రక్తపు మడుగులో పడి ఉండగా, అతని సహాయకుడు ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి సహాయం కోసం పిలిచాడు. అక్కడే ఉన్న భజన్ సింగ్ అనే ఆటో డ్రైవర్ సైఫ్‌ను సేఫ్ గా ఆస్పత్రికి తీసుకెళ్లిపోయాడు. తెల్లటి బట్టలతో, రక్తంతో నిండిన వ్యక్తి కారులోకి రావడం చూసిన భజన్ సింగ్‌కి ఆ వ్యక్తి సైఫ్ అలీఖాన్ అని కూడా తెలియదట.
‘రక్తంతో తడిసిన వ్యక్తి నా కారులోకి ఎక్కాడని నాకు మాత్రమే తెలుసు, అప్పుడు ఎవరు అని కూడా చూడలేదు. వీలైనన్ని షార్ట్ కట్స్ తీసుకుని మనిషిని హాస్పిటల్ కి చేర్చడమే నా లక్ష్యం. నేను అలానే చేసాను. సైఫ్ అలీఖాన్ ఆ రోజు తెల్లటి దుస్తులు ధరించాడు. అతని సహాయకుడు, కుమారుడు తైమూర్ మాత్రమే సైఫ్ తో ఉన్నారు’అని భజన్ సింగ్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
‘గాయపడిన సైఫ్ అలీఖాన్ నా ఆటో ఎక్కేటప్పటికి స్పృహలోనే ఉన్నాడు. అతను ఆందోళన కూడా చెందడంలేదు. జాగ్రత్తగా ఉంటూ, ఆసుపత్రికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది అని మాత్రమే అడిగాడు. అతని కేరింగ్ నేచర్ చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. సైఫ్‌ను ఆసుపత్రికి తరలించినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే, నేను అతని నుండి ఎలాంటి డబ్బులు కూడా తీసుకోలేదు, అతన్ని ఆసుపత్రికి తీసుకురావడమే నా ప్రథమ లక్ష్యం” అని భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.