కొత్తబంగారు లోకం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. యూత్ ను ఆకట్టుకునే కథతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో శ్రీకాంత్ అడ్డాల పేరు ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది. ఆతర్వాత ‘ముకుంద’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు శ్రీకాంత్ అడ్డాలా.. ఈ సినిమా తోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమా కూడా అందమైన క్రేమా కథగా తెరకెక్కించాడు శ్రీకాంత్. ఇలా వరుసగా విజయాలను అందుకున్న శ్రీకాంత్ ఆతర్వాత ఓ అడుగు ముందుకేసి సూపర్ స్టార్ మహేష్ బాబు-సీనియర్ హీరో వెంకటేష్ తో కలిసి ‘సీతమ్మవాకిట్లో’ సిరిమల్లె చెట్టు సినిమా చేసాడు. ఈ మల్టీస్టారర్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో మహేష్, వెంకటేష్ నటన, కథ , సాంగ్స్ అన్ని ప్రేక్షకులను మెప్పించాయి.
శ్రీకాంత్ సినిమాలు అంటే అచ్చమైన తెలుగుతనం ఉట్టిపడుతుంది. అదే క్రమంలో బ్రహ్మోత్సవం సినిమా చేసి బోర్లా పడ్డాడు. ఆతర్వాత ఆయన తన రూట్ మర్చి వెంకటేష్ తో ‘నారప్ప’ సినిమా చేశాడు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘అసురన్’ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈసినిమా తర్వాత కొత్త హీరో ప్రాజెక్టను అనౌన్స్ చేయలేదు శ్రీకాంత్ అడ్డాల.
నిజానికి ఓ కన్నడ హీరోతో సినిమా చేయడానికి శ్రీకాంత్ సన్నాహాలు చేశారు. కానీ ఈలోగా ఆ హీరో జైలు పాలయ్యాడు. ఆతర్వాత ఇప్పుడు మరో సినిమాను లైనప్ చేశారు. ఈసారి ఇద్దరు అక్కా చెల్లెళ్ల కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు శ్రీకాంత్. సీతమ్మ వాకిట్లో సినిమాలో అన్నదమ్ముల కథ చెప్పిన శ్రీకాంత్. ఈసారి అక్కాచెల్లెళ్ల కథతో రానున్నడని అంటున్నారు. బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని తెలుస్తుంది. ఈ చిత్రానికి ‘కూచిపూడి వారి వీధిలో’ అనే ఆసక్తికరమైన టైటిల్ రిజిస్టర్ చేయించారు. పూర్తిగా గోదావరి జిల్లాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాకోసం హీరోయిన్స్ ను వెతికే పనిలో ఉన్నాడు శ్రీకాంత్. హీరోయిన్స్ ఫిక్స్ అవ్వగానే సినిమాను మొదలు పెట్టనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి