Study Abroad Scholarships: విదేశాల్లో చదివే పేదింటి విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు అందించే సంస్థలు ఇవే.. ఫుల్ లిస్ట్ ఇదే!

2 hours ago 2

ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల లిస్టులో ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, సోర్బోన్ వంటి పలు యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిల్లో చదివేందుకు వేల మంది విద్యార్థులు, స్కాలర్లు ఉవ్విళ్లూరు తుంటారు. అయితే ఈ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందాలంటే ట్యూషన్ ఫీజుతోపాటు లివింగ్‌ ఎక్స్‌పెన్సెస్‌ భరించడానికి అవసరమైన నిధులను ఏర్పాటు చేసుకోవల్సి ఉంటుంది. ఇందుకు చాలా మంది విద్యార్ధులు పలురకాల స్కాలర్‌షిప్‌లపై ఆధారపడుతుంటారు. ఇందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు విదేశాలలో చదువుకోవడానికి విద్యార్ధులకు అవసరమైన నిధులను స్కాలర్‌షిప్‌ల రూపంలో అందిస్తున్నాయి. విదేశాల్లో చదువుకోవడానికి 100% స్కాలర్‌షిప్‌లను అందించే సంస్థలు, వాటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

స్కాలర్‌షిప్‌లు ఎన్ని రకాలు ఉంటాయంటే?

విద్యార్థులు, స్కాలర్లకు అవసరమైన నిధులు అందించడమే స్కాలర్‌షిప్‌ల ప్రధాన ఉద్దేశ్యం. అయితే స్కాలర్‌షిప్‌లు కూడా వివిధ రకాలుగా ఉంటాయి. అవేంటంటే..

మెరిట్ స్కాలర్‌షిప్‌లు

విద్యా, నాయకత్వ నైపుణ్యాలు, పాఠ్యేతర కార్యకలాపాలలో రాణించిన విద్యార్థులకు పలు యూనివర్సిటీలు ఈ స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేస్తాయి. ఆయా సంస్థల నుంచి షరతులతో కూడిన అంగీకార లేఖను పొందిన తర్వాత మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఫీల్డ్-స్పెసిఫిక్ స్కాలర్‌షిప్‌లు

ఈ రకమైన స్కాలర్‌షిప్‌ను STEM, పబ్లిక్ సర్వీస్, సోషల్ సైన్సెస్ మొదలైన వాటిలో విద్యను అభ్యసించడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇస్తారు.

ఫైనాన్షియల్ నీడ్‌ స్కాలర్‌షిప్‌లు

ఈ స్కాలర్‌షిప్‌లు విద్యార్ధుల విద్యా ప్రతిభ కంటే ఆర్థిక నేపథ్యం ఆధారంగా ఇస్తారు. ఈ స్కాలర్‌షిప్‌ పొందాలంటే ఆదాయ, పన్ను రిటర్న్‌లకు సంబంధించిన పత్రాలను సమర్పించవల్సి ఉంటుంది.

ప్రభుత్వ నిధులతో కూడిన స్కాలర్‌షిప్‌లు

ప్రభుత్వ నిధులతో కూడిన ఈ స్కాలర్‌షిప్‌లు రెండు దేశాల మధ్య అంతర్జాతీయ విద్య, సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహిస్తాయి. ఉదాహరణకు.. కామన్వెల్త్ స్కాలర్‌షిప్ (UK), ఫుల్‌బ్రైట్ ప్రోగ్రామ్ (USA), DAAD స్కాలర్‌షిప్‌లు (జర్మనీ) ఈ విధమైనవే. ఇవి ట్యూషన్, లివింగ్‌ ఎక్స్‌పెన్సెస్‌, ప్రయాణ ఖర్చులను కవర్ చేస్తాయి.

వందశాతం పూర్తి నిధులు సమకూర్చే స్కాలర్‌షిప్‌

విదేశాలలో చదువుకునే విద్యార్ధులకు పూర్తి నిధులతో కూడిన స్కాలర్‌షిప్‌లను అందించే విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ స్కాలర్‌షిప్‌లు 100% నిధులను అందిస్తాయి. వాటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

యూనివర్సిటీ వెబ్‌సైట్‌లు… ఇందులో పలు యూనివర్సిటీలు అందించే స్కాలర్‌షిప్‌ల వివరణాత్మక జాబితా, అర్హత ప్రమాణాలు, గడువు సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ‘ఆర్థిక సహాయం,’ ‘స్కాలర్‌షిప్’ లేదా ‘అంతర్జాతీయ విద్యార్థి’ విభాగాల కింద అందించే నిధుల సమాచారం ఇక్కడ తెలుసుకోవచ్చు.

ప్రభుత్వ వెబ్‌సైట్‌లు.. భారత ప్రభుత్వం ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి.. ప్రపంచ సహకారాన్ని పెంపొందించడానికి విద్యార్ధుల చదువుకు పలు స్కాలర్‌షిప్‌ల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌లు ద్వారా ట్యూషన్ ఫీజు, జీవన వ్యయం, ప్రయాణ ఛార్జీలు, వీసా ఖర్చులను కవర్ చేస్తాయి. ఈ విధమైన స్కాలర్‌షిప్ ప్రకటనల కోసం ‘ఉన్నత విద్యా శాఖ’, విద్యా మంత్రిత్వ శాఖ (భారత ప్రభుత్వం) వెబ్‌సైట్‌లు చెక్ చేయవచ్చు. జాతీయ స్కాలర్‌షిప్‌లు, ఎక్స్‌టర్నల్‌ స్కాలర్‌షిప్‌లు, విద్యా రుణాలకు సంబంధించిన పథకాలు విద్యా మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

కంట్రీ బేస్డ్‌ స్కాలర్‌షిప్ ప్లాట్‌ఫామ్స్‌

UK, USA, జపాన్ వంటి ఇతర దేశాలు విద్యార్ధులకు అందించే విదేశీ స్కాలర్‌షిప్‌లు ఇవి. ఇలా పలు దేశాలకు సంబంధించిన స్కాలర్‌షిప్‌లను ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే UKలో అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే బ్రిటిష్ కౌన్సిల్ ఇండియా వెబ్‌సైట్‌లో స్కాలర్‌షిప్‌ సమాచారాన్ని చెక్‌ చేసుకోవచ్చు.

100% స్కాలర్‌షిప్‌లు అందించే ఇతర దేవాల వెబ్‌సైట్‌లు ఇవే..

  • EducationUSA
  • DAAD (Deutscher Akademischer Austauschdienst) – Germany
  • Study Australia
  • EduCanada
  • MEXT assistance – Japan

మరికొన్ని సూచనలు

  • ఈ స్కాలర్‌షిప్‌లు పొందాలంటే విద్యార్ధులు తమ ఎడ్యుకేషన్‌ ప్రొఫైల్‌ను పక్కాగా రూపొందించాలి. ఇందులో తమ అర్హత ప్రమాణాలను కూలంకషంగా హైలెట్‌ చేస్తూ వివరించగలగాలి.
  • పూర్తిగా నిధులతో కూడిన స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు బలమైన సిఫార్సు లేఖలను (LORS) ఏర్పాటు చేసుకోవాలి. ఈ సిఫార్సు లేఖ ఇచ్చే వ్యక్తులు ఆయా విద్యార్ధులకు బాగా తెలుసని నిర్ధారించాలి.
  • ప్రతి సంవత్సరం వందల వేల మంది విద్యార్థులు ఒకే స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు చెవెనింగ్ స్కాలర్‌షిప్‌కు యేటా 102,274 దరఖాస్తులు వస్తుంటాయి. అందువల్ల స్కాలర్‌షిప్ అధికారిక వెబ్‌సైట్‌ విండో తెరిచిన వెంటనే దరఖాస్తు చేసుకుంటే పోటీలో ముందుండే అవకాశం ఉంటుంది.
  • ఇంటర్వ్యూ సమయంలో పొరబాట్లకు తావులేకుండా అన్నీ ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవాలి. ఇందుకు గత స్కాలర్‌షిప్ విజేతల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవడానికి వారితో సంభాషించవచ్చు.
  • అలాగే మీరు దరఖాస్తు చేసుకునే ప్రోగ్రామ్‌కు వంద శాతం స్కాలర్‌షిప్ అవకాశాలు ఉన్నాయో లేవో ముందుగానే పరిశోధించాలి. ఈ విధమైన స్కాలర్‌షిప్‌లు విదేశీ విద్య సజావుగా కొనసాగించడానికి, విదేశాలలో చదువుకునే ఎంతో మంది విద్యార్థులకు ఆర్థిక అండగా నిలుస్తాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article