Thandel Movie: తండేల్ టీమ్‌కు గుడ్ న్యూస్‌.. టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి.. రేట్స్ ఎలా ఉన్నాయంటే?

2 hours ago 1

లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి మరోసారి కలిశారు. వీరిద్దరు జంటగా నటించిన రెండో చిత్రం తండేల్. కార్తికేయ 2తో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కించాడు. బన్నీ వాస్, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు, కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తండేల్ ఫిబ్రవరి 07న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా హైదరాబాద్ లోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. తాజాగా తండేల్ టీమ్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చిత్ర బృందం చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని తండేల్ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీలోని అన్ని సింగిల్ స్క్రీన్స్ లో జీఎస్టీతో కలిపి రూ.50, మల్టీప్లెక్స్ లో జీఎస్టీతో కలిపి రూ.75 పెంచుకునేలా ఆదేశాలిచ్చింది. సినిమా విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు ఈ అదనపు ధరలు అమలులో ఉండనున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం (ఫిబ్రవరి 05) అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.

తండేల్ సినిమాలో సాహో ఫేమ్ ప్రకాశ్ బేల్వాడి, పుష్ప ఫేమ్ కల్పలత, కరుణా కరన్, మహేష్ అచంట తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తండేల్ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. బుజ్జి తల్లి, నమోఃనమ శివాయ, హైలెస్సో హైలెస్సా పాటలకు యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య తండేల్ రాజ్‌ అనే మత్స్యకారుని పాత్రలో కనిపించనున్నాడు. మత్స్యకారుల జీవనం నేపథ్యంలో కొన్ని యధార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. కొందరు భారత జాలర్లు పొరపాటున పాక్‌ భూభాగంలోకి వెళ్లడం, పాక్ కోస్ట్ గార్డ్స్ వారిని అదుపులోకి తీసుకోవడం తదితర పరిణామాల నేపథ్యంలో తండేల్ మూవీని తెరకెక్కించారు.

ఇవి కూడా చదవండి

#Thandel beforehand bookings opened astatine Vizag, Vijayawada, Guntur, Ongole, Tirupati, Anantapur, Hindupur, Pulivendula and fewer different locations crossed AP.

Check it retired & drawback your tickets 🎟 – https://t.co/6AxCQuP3uh#ThandelonFeb7th #ThandelRaju#NagaChaitanya @chay_akkineni pic.twitter.com/zom0wzU5Rt

— Trends NagaChaitanya™ (@TrendsChaitu) February 4, 2025

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article