ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్లలో ఆమె ఒకరు. నటిగా తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది. విభిన్నమైన కథలు.. వైవిధ్యమైన పాత్రలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హిందీ, తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. పైన ఫోటోను చూశారు కదా.. ఇంతకీ ఆమె ఎవరంటే.. ఆ బ్యూటీ మరెవరో కాదు.. హీరోయిన్ జాన్వీ కపూర్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పరం సుందరి అనే రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటిస్తుంది. ఇందులో బీటౌన్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా జాన్వీ షేర్ చేసిన ఫోటో చూసి నెటిజన్స్ షాకవుతున్నారు.
అందులో జాన్వీ ఎర్రగా కందిపోయి.. బొబ్బలొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇన్ స్టాలో జాన్వీ షేర్ చేసిన మిర్రర్ సెల్ఫీ ఈ సంగతిని బయటపెట్టింది. అందులో జాన్వీ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తుంది.. బర్ట్స్ అంటూ క్యాప్షన్ రాసింది. దీంతో జాన్వీ ఫోటోస్ పై నెటిజన్స్ విభిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. మరీ ఇంతగా ఎండా వానా పట్టించుకోకుండా శ్రమించాలా.. ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం పరం సుందరి మూవీ షూటింగ్ కొచ్చిలో జరుగుతున్నట్లు సమాచారం. జాన్వీ మాత్రమే కాకుండా సిద్ధార్థ్ సైతం షూటింగ్ నుంచి గతంలో కొన్ని ఫోటోస్ షేర్ చేశారు. ఓ చక్కని ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా వస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది జాన్వీ.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన