పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నోడిని చూశారా.. ? అతడు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది హీరో. బాలీవుడ్ ఇండస్ట్రీలో అతడి తండ్రి సూపర్ స్టార్. కానీ తనయుడు మాత్రం హీరోగా సక్సెస్ కాలేకపోయారు. హీరోగా పలు చిత్రాల్లో నటించినప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? అతడే బీటౌన్ స్టార్ అభిషేక్ బచ్చన్. నిన్న (ఫిబ్రవరి 5న) అభిషేక్ పుట్టినరోజు సందర్భంగా అతడి చిన్ననాటి ఫోటో షేర్ చేసింది అతడి భార్య, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ చిన్ననాటి పిక్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఇదిలా ఉంటే.. కొన్ని రోజులుగా ఐశ్వర్య, అభిషేక్ వ్యక్తిగత విషయాల గురించి నెట్టంట చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని.. త్వరలోనే వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది. అలాగే కొన్ని రోజులుగా వీరిద్దరు దూరంగా ఉండడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ కొన్ని సందర్భాల్లో వీరిద్దరు కలిసి కనిపించడం.. తమ డివోర్స్ రూమర్స్ పై స్పందించకపోవడంతో ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా తన భర్త అభిషేక్ బచ్చన్ కు ఐశ్వర్య విషెస్ చెప్పడంతో మరోసారి వీరిద్దరి విడాకుల ప్రచారానికి తెర పడింది.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం అభిషక్ బచ్చన్ చిన్ననాటి ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్ కాకపోయినా.. వ్యాపారంలో మాత్రం విజయం సాధించాడు అభిషేక్. ఎన్నో రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన